మంత్రిగా జోగు: స్పీకర్‌ చారికి అభినందనలు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం డి బ్లాక్ రెండో అంతస్తులోని తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4.15 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కంపెన్సేటరీ ఏఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధుల వినియోగంపై ఆయన తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ... తెలంగాణలో అడవుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అటవీప్రాంతం ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టపరమైన ఆంక్షల్ని తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇసుక మాఫియా, అటవీ చట్టాల కారణంగా పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటంపై అధికారులతో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా నియామకమైన మధుసూదనాచారిని బుధవారం పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అభినందలు తెలియజేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ కూడా మధుసూదనాచారికి అభినందనలు తెలిపారు.

స్పీకర్‌కు అభినందనలు

స్పీకర్‌కు అభినందనలు

అసెంబ్లీ స్పీకర్‌గా నియామకమైన మధుసూదనాచారికి అభినందనలు తెలుపుతున్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు.

డికె అరుణ అభినందనలు

డికె అరుణ అభినందనలు

అసెంబ్లీ స్పీకర్‌గా నియామకమైన మధుసూదనాచారికి అభినందనలు తెలుపుతున్నమాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ.

డిజిపి అభినందనలు

డిజిపి అభినందనలు

అసెంబ్లీ స్పీకర్‌గా నియామకమైన మధుసూదనాచారికి అభినందనలు తెలుపుతున్న తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగు

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగు

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు స్వీకరించారు.

సహచరుల అభినందనలు

సహచరుల అభినందనలు

సచివాలయం డి బ్లాక్ రెండో అంతస్తులోని తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4.15 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.

కుటుంబ సభ్యులతో..

కుటుంబ సభ్యులతో..

తెలంగాణలో అడవుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జోగు రామన్న తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అటవీప్రాంతం ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టపరమైన ఆంక్షల్ని తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సిఎస్‌తో హరీశ్ రావు, కొండా సురేఖ.

నామినేషన్ దాఖలు

నామినేషన్ దాఖలు

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఆమెతోపాటు హరీశ్ రావు, కెటిఆర్, కొండా సురేఖ ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+