ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం: నోట్ల కట్టలు, భారీగా బంగారం(పిక్చర్స్)
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. వరుసగా అవినీతి అధికారులపై దాడులు చేస్తూ లంచావతారులకు హడలెత్తిస్తోంది. వివిధ శాఖల పరిధిలో వస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారి అక్రమ
అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. వరుసగా అవినీతి అధికారులపై దాడులు చేస్తూ లంచావతారులకు హడలెత్తిస్తోంది. వివిధ శాఖల పరిధిలో వస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారి అక్రమ బండారాలను బయటపెడుతోంది. తాజాగా, మరో అవినీతి తిమింగలాన్ని పట్టేసింది. ఏసీబీ.

భారీగా అక్రమాస్తులు..
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కరణం వెంకట సాయికుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై సోమవారం ఉదయం నుంచి ఏక కాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

ఏకకాలంలో దాడులు
57 ఏళ్ల సాయికుమార్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నివాసముంటున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖైరతాబాద్‌లోని ఆయన ఇంటితో పాటు కడప, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, బెంగళూరులోని సాయికుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకాలంలో తనిఖీలు కొనసాగించారు.

మంత్రుల వద్ద కార్యదర్శిగానూ..
ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ పర్యవేక్షణలో సోదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాయికుమార్ మంత్రుల వద్ద కార్యదర్శిగానూ, పలు ఆదాయ ఆర్జన విభాగాల్లో కీలక విధులు నిర్వహించినట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున అక్రమ ఆస్తులపై ఎలాంటి సమాచారం తెలియడం లేదు.

రూ.3కోట్లకుపైగానే అక్రమాస్తులు
సాయికుమార్ అక్రమార్జన రూ.3కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లోని రెండు లాకర్లను తెరవాల్సి ఉందని చెప్పారు.

అంతా అవినీతి సొమ్మే..
బెంగళూరులో రెండు రెసిడెంట్ ప్లాట్లు, భారీగా బంగారు ఆభరణాలు, రూ.20లక్షల నగదు, రూ.15లక్షల బ్యాంక్ బాలెన్స్, రూ.16లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రైవేటు చిట్ ఫండ్ కు చెల్లించిన రూ. 20లక్షల రిసీట్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీ తెలిపారు. ఓ కారు, ద్విచక్ర వాహనం, అత్యంత విలువైన విదేశీ చేతిగడియారాలను సవ్ాధీనం చేసుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications