జర్నలిస్ట్ శివప్రసాద్ కిడ్నాప్: నోటీసులు ఇవ్వకుండా, వారెంట్ లేకుండా: లోకేశ్..
జర్నలిస్టు శివప్రసాద్‌ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా హైదరాబాదులో గల ఇంటి నుంచి తీసుకెళ్లారని లోకేశ్ ఆరోపించారు. ఇంతకీ శివప్రసాద్ చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. ఏంచేశాడని శివప్రసాద్ ను తీసుకెళ్లారు? అతను ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడితే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు.
శివప్రసాద్ నుంచి ఫోన్ లాగేసుకున్నారని.. వారెంట్ లేకుండా ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. ఘటనను జర్నలిస్టు కుటుంబం ఆడియో రూపంలో రికార్డు చేసి షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అని లోకేశ్ అడిగారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్ల పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు.

Recommended Video
జర్నలిస్ట్ శివప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, ఎంపీ బాలశౌరిపై కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు తీసుకెళ్లారని.. విడిచిపెడతారని విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిపై ఏపీ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Journalist Siva Prasad was kidnapped by the AP police from his residence in Hyderabad today without a notice. And what did he do? He spoke out about the AP Govt’s policies. They have illegally confiscated his phone without a warrant or warning. (1/3) pic.twitter.com/SyjlSEYf2y
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 28, 2020
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications