ఎన్డీఏలోకి టీడీపీ, బీజేపీ ప్రకటన - సీట్ల షేరింగ్ పై క్లారిటీ..!!

ఏపీలో పొత్తు అధికారికం అయింది. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరిక ఖరారైంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు పొత్తు పైన ప్రకటన చేసారు. టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో టీడీపీ, జనసేన దేశం కోసం..ఏపీ ప్రజల ఆశల సాధన కోసం కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సీట్ల పైన ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

ఎన్డీఏలోకి టీడీపీ, జనసేనను ఆహ్వానిస్తూ నడ్డా ప్రకటన చేసారు. దేశం కోసం..ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి పని చేయటానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. రెండు పార్టీలకు స్వాగతం పలికారు. టీడీపీ కొత్త మిత్రుడు కాదని, ఎప్పటి నుంచో ఎన్డీఏతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఇది గతంలో ఉన్న అనుబంధమేనని చెప్పుకొచ్చారు. పదేళ్ల కాలంగా మోదీ నాయకత్వంలో దేశాభివృద్దిని కొత్త చరిత్ర వైపు తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రజల కలల సాధన కోసం బీజేపీ తో కలిసి టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తాయని నడ్డా పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటనగా విడుదల చేసారు.

JP Nadda Welcomes the Decision on Chandra Babu to join in NDA decided to contest together

సీట్ల విషయంలోనూ కీలక అంశాలను ప్రస్తావించారు. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మూడు పార్టీల కలిసి పోటీ చేయటం పైన స్పష్టత ఇచ్చారు. కలిసి పోటీ పైన నిర్ణయం జరిగిందని..సీట్ల అంశం పైన ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. 2014లోనూ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసాయని గుర్తించారు. జనసేన సహకారంతో నాడు కేంద్రం, ఏపీలో అధికారంలోకి వచ్చామని వివరించారు. సీట్ల అంశం పైన సుదీర్ఘంగా చర్చలు జరిగాయన్నారు. దేశం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న మోదీ నాయకత్వంలో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చిన చంద్రబాబు, పవన్ ను నడ్డా వివరించారు. ఈ మైత్రి ఏపీ ప్రయోజనాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.

2019 ఎన్నికల ముందు బీజేపీతో విభేదించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆరేళ్ల విరామం తరువాత ఇప్పుడు తిరిగి తాజా ఎన్నికల వేళ ఎన్డీఏలో చేరేందుకు నిర్ణయించారు. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి కొత్త మిత్రులను ఆహ్వానించారు. చంద్రబాబు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇప్పుడు 2014 తరహాలో మూడు పార్టీలు తిరిగి కూటమిగా పోటీ చేస్తుండటంతో...సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ వీరిని ఎలా ఎదుర్కొంటారు.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+