పవన్ కళ్యాణ్ కటౌట్స్‌తో జెపి రాజకీయం (పిక్చర్స్)

విశాఖపట్నం: లోకసత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి సీమాంధ్ర సుడిగాలి పర్యటన చేస్తుంటే జెపి సరికొత్త పద్ధతిలో ప్రచారం సాగిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలో ఆయన బుధవారం తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం సాగించారు. ఆయన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో కూడిన కటౌట్లను వాడుతూ ప్రచారం సాగించారు. మల్కాజిగిరి లోకసభ స్థానంలో చంద్రబాబు జెపికి మద్దతు ఇవ్వకుండా తమ పార్టీ అభ్యర్థిని నిలిపారు.

పొత్తు ధర్మమంటూ పవన్ కళ్యాణ్ మల్కాజిగిరిలో జెపికి ప్రచారం చేయడానికి నిరాకరించారు. మల్కాజిగిరి విషయంలో తనను కలిసిన జెపికి నరేంద్ర మోడీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. అయినా, ఆ ముగ్గురితో కలిసి నడవడానికే జెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జెపి ప్రచారం

జెపి ప్రచారం

లోకసత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ తన అభ్యర్థుల కోసం విశాఖపట్నం జిల్లాలో ప్రచారం చేశారు.

జెపి ప్రచారం

జెపి ప్రచారం

తన అభ్యర్థుల కోసం జయప్రకాష్ నారాయణ బుధవారం విశాఖపట్నం జిల్లాలో రోడ్ షో నిర్వహించారు.

జెపి ప్రచారం

జెపి ప్రచారం

విశాఖఫట్నం జిల్లాలో తమ పార్టీ అభ్యర్థుల కోసం జయప్రకాష్ నారాయణ విస్తృత ప్రచారం సాగించారు.

జెపి ప్రచారం

జెపి ప్రచారం

జయప్రకాష్ నారాయణ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి నడవడానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+