అభిమాని సెల్ఫీ సూసైడ్-స్పందించిన జూ.ఎన్టీఆర్-జగన్ ముందు ఓ డిమాండ్..

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న వీడియోలో అతను తన ఆత్మహత్యకు గల కారణాలని వెల్లడించాడు. అయితే ఈ ఆత్మహత్య వెనుక వైసీపీ ఉందనే ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తెరపైకి తెస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీనిపై నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూసైడ్ కు ముందు అతడు తీసుకున్న ఈ సెల్ఫీ వీడియోలో.. 'అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా.. మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా' అని ఉంది. అయితే ఈ ఆత్మహత్యపై జూనియర్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

jrntrdemandsapgovernmentprobeonhisfanshyam

ఇదే తరుణంలో రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీపై విమర్శల దాడి చేస్తున్న విపక్ష టీడీపీ కూడా ఈ సూసైడ్ పై అనుమానాలు వ్యక్తంచేసింది. అంతటితో ఆగకుండా వైసీపీ నేతలు దీని వెనుక ఉన్నారంటూ విమర్శలు ప్రారంభించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన ఈ లేఖలో ఆయన ఓ కీలక విజ్ఞప్తి చేశారు.

శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, అతని కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఎటువంటి పరిస్దితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపై తక్షణం దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ జూనియర్ తన లేఖను ముగించారు. దీంతో జూనియర్ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+