పెడన పవన్ కళ్యాణ్ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు.. హంగామా!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
జనసేన టిడిపితో పొత్తు పెట్టుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ సభలో తెలుగు తమ్ముళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు తమ మద్దతును తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. గతంలో అనేక సందర్భాలలో ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ అభిమానులు అనేక కొటేషన్స్ ను ప్రస్తావించడం కూడా తెలిసిందే. నేను ఎన్టీఆర్ అభిమానినే కానీ ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం అంటూ రాసుకున్న కొటేషన్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా మరో మారు నేడు పెడనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ సభకు భారీగా జనసేన కార్యకర్తలతో, పాటు టీడీపీ శ్రేణులు కూడా హాజరయ్యారు. వారిలో కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగు లతో వచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు.
కానీ తారక్ అభిమానులు మాత్రం టీడీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సభలో ఎన్టీఆర్, పవర్ స్టార్ నినాదాలతో సభ మొత్తం కోలాహలంగా మారింది. మరి ఈ అభిమానం వచ్చే ఎన్నికలలో జనసేనకు ఓటు బ్యాంకుగా మారుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications