చెప్పుతో దాడికి యత్నం, జూ.డాక్టర్ ఆత్మహత్యాయత్నం, ఎక్కడంటే?

తిరుపతి: తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూనియర్ డాక్టర్ వెంకటరమణ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కార్యాలయం వద్ద జూడాలు ఆందోళనకు దిగారు.

Junior doctor Venkatramana suicide attempt in Ruia hospital

మూడు రోజుల క్రితం రుయూ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ వెంకటరమణపై అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న క్లర్క్ కృష్ణకుమారి దాడికి ప్రయత్నించింది. తన బంధువులకు చికిత్స చేయడంలో జూనియర్ డాక్టర్ వెంకటరమణ నిర్లక్ష్యంగా వ్యవరించాడని ఆరోపిస్తూ క్లర్క్ కృష్ణకుమారి వెంకటరమణపై దాడికి ప్రయత్నించిందని జూడాలు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించారని కృష్ణకుమారిపై జూడాలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అలిపిరి పోలిస్ స్టేషన్‌లో కూడ జూడాలు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వెంకటరమణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే జూనియర్ డాక్టర్ వెంకటరమణపై దాడికి ప్రయత్నించిన క్లర్క్ కృష్ణకుమారిని బదిలీ చేస్తామని సూపరింటెండ్ హమీ ఇచ్చారు. అయితే గురువారం సాయంత్రానికి బదిలీ విషయమై మాటమార్చారనే సమాచారంతో తీవ్ర మనస్థాపానికి గురైన జూనియర్ డాక్టర్ వెంకటరమణ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

విషయం తెలుసుకొన్న జూడాలు వెంటనే రుయాలోని అత్యవసర విభాగానికి వెంకటరమణను తరలించి చికిత్స చేయిస్తున్నారు. రుయా ఆసుపత్రి సూపరింటెడ్ కార్యాలయం ఎదుట గురువారం రాత్రి జూడాలు ఆందోళనకు దిగారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సబ్ కలెక్టర్ సంఘటనస్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+