తప్పంతా జూనియర్ ఎన్టీఆర్ దే?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకొని వారం రోజుల క్రితం హైదరాబాద్ లో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు. వారం రోజుల నుంచి రాజకీయ రంగంలోకానీ, సినీ రంగంలోకానీ వారం రోజుల నుంచి చర్చంతా జూనియర్ ఈ వేడుకలకు ఎందుకు హాజరుకాలేదు? అనే అంశంపైనే జరుగుతోంది.

నందమూరి, నారా కుటుంబాలు తారక్ ను చాలా సంవత్సరాల నుంచి అవమానిస్తున్నాయని, అతణ్ని సినీరంగంలో కూడా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, వేడుకలకు రాకుండా జూనియర్ మంచి పనిచేశాడని ఒక వర్గం అంటోంది. అయినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవడంతోపాటు ఆరోజు పుట్టినరోజు కాబట్టి ఎలా వస్తాడని ప్రశ్నిస్తోంది. విజయవాడలో జరిగిన వేడుకలకు కూడా తారక్ ను పిలవలేదని, ఇప్పుడు పిలిచినా హాజరు కాలేదని, తాతపేరుతో జరుగుతున్న శతజయంతి వేడుకలకంటే ట్రిప్ ముఖ్యమా? పుట్టినరోజు ముఖ్యమా? అని మరో వర్గం వాదిస్తోంది.

 jrntr

జూనియర్ ఎన్టీఆర్ ను ఈ వేడుకలకు రావాలంటూ స్వయంగా ఆహ్వానించింది మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్. తారక్ ఎందుకు హాజరుకాలేదు అనే అంశంపై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముందుగా అపాయింట్ మెంట్ అడిగితే వారం రోజుల తర్వాత కలిసే అవకాశం ఇచ్చారని, విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వేడుకలకు రాలేకపోతున్నానని తారక్ చెప్పారన్నారు. అయితే ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నైనా చేసుకోవచ్చని, కానీ శతజయంతి వేడుకలు మాత్రం ఒకసారే వస్తాయని, వస్తే బాగుంటుందని తాము చెప్పినట్లు జనార్దన్ తెలిపారు.

మొత్తం 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారన్నారు. కళ్యాణ్ రామ్‌ను కూడా శత జయంతి వేడుకలకు ఆహ్వానించామని.. ఐతే ఆయన కూడా తారక్‌తో పాటే వెళ్లినట్లున్నారని.. అందుకే రాలేకపోయారని భావిస్తున్నట్లు జనార్దన్ వెల్లడించారు. మొత్తానికి ఈ వ్యవహారంలో తప్పంతా తారక్ దే అని, తెలుగుదేశం పార్టీవైపు ఎటువంటి తప్పులేదని చెప్పినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+