జగన్‌ను నేరుగా ఎదుర్కో: బాబుకు జూపూడి సవాల్

శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిష్టిబొమ్మలా తయారయ్యారని, చేతనైతే జగన్‌ను నేరుగా ఎదుర్కొవాలని జూపూడి సవాల్ విసిరారు. కౌరవుల్లా కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సీమాంధ్రలో 143 స్థానాల్లో తమ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ మేనిఫెస్టో కమిటీ శుక్రవారం సమావేశమైందని, త్వరలోనే మరో సారి సమావేశమై మేనిఫెస్టోను ప్రకటిస్తామని జూపూడి ప్రభాకరరావు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతి అని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ ఒక్క ఛార్జీ కూడా పెరగలేదని ఆయన గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో తమ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రలో కూడా పెద్ద భాగస్వామ్య పార్టీ కాబోతుందని జూపూడి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా అభివృద్ధికి బాటలు వేసేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications