వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు విమర్శలకు జస్టిస్ చంద్రు కౌంటర్-చెత్త వార్తలు-రిటైరయ్యాక ఏ పదవీ తీసుకోలేదంటూ

|
Google Oneindia TeluguNews

ఏపీలో మద్రాస్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రు వ్యాఖ్యల దుమారం వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతూనే ఉంది. ఇప్పటికే చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేయగా... ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. జస్టిస్ చంద్రు పదవుల కోసమే వైసీపీ భజన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలపై జస్టిస్ చంద్రు స్పందించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

 జస్టిస్ చంద్రు వ్యాఖ్యల రచ్చ

జస్టిస్ చంద్రు వ్యాఖ్యల రచ్చ

మద్రాస్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రు ఏపీలో వైసీపీ సర్కార్ కు అనుకూలంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పోరాటం చేయాల్సి వస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ చంద్రు... వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు వ్యాఖ్యలు చేశారన్న విషయం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత దీనిపై రాజకీయ రచ్చ కూడా మామూలుగా లేదు. ఆ తర్వాత హైకోర్టు కూడా ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది.

 చంద్రబాబు పదవుల కామెంట్స్

చంద్రబాబు పదవుల కామెంట్స్

తనకు సంబంధం లేని ఏపీకి వచ్చి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడటంపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. రిటైరైన తర్వాత రాజకీయ పదవుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తన కుమారుడికి పదవి తీసుకుని రోజూ జగన్ సర్కార్ ను పొగుడుతున్నారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు చేసిన పదవుల కామెంట్స్ ఈ రచ్చను మరింత ముందుకు తీసుకెళ్లాయి. దీనిపై ఇప్పుడు జస్టిస్ చంద్రు స్పందించారు.

 చంద్రబాబు కామెంట్స్ పై చంద్రు స్పందన

చంద్రబాబు కామెంట్స్ పై చంద్రు స్పందన

విజయవాడ పర్యటనలో తాను చేసిన వ్యాఖ్యలపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తాకథనాలపై, ఆరోపణలపై, జస్టిస్ చంద్రు మొదటిసారిగా స్పందించారు. APCLA సంస్థకు ఈమెయిల్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత పదవు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

MLC Elections : బిగ్ ఫైట్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల కోలాహలం..! || Oneindia Telugu
 చెత్త వార్తలంటూ ఫైర్

చెత్త వార్తలంటూ ఫైర్

జస్టిస్ చంద్రు తన ఈమెయిల్ రియాక్షన్ లో ... ఈ చెత్త వార్తలను నమ్మవద్దు, నేను రిటైర్ అయిన తరువాత 9 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం నుంచి ఏ పదవిని స్వీకరించలేదు. మోహన కుమార మంగళం 1960లో m/s row&reddy నుంచి భిన్నాభిప్రాయాలకు కారణంగా వైదొలిగారు. 1968లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవగానే ఆ సమయంలో నేను సిపిఎం పార్టీ లో ఉన్నాను. కనుక కట్టుకథలు సృష్టించి ఎలా వ్యాప్తి చెందుతుందో ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుందంటూ వ్యాఖ్యానించారు. అలాంటి తనను ఇప్పుడు పదవుల కోసం వ్యాఖ్యలు చేస్తున్నానంటూ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

English summary
former madras high court cj justice chandru has reacted on tdp chief chandrababu's comments on political posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X