ప్రభుత్వపెద్దల అవినీతి ఆరోపణలనూ విచారించే అధికారం ఆయనదే: లోకాయుక్తగా జస్టిస్ పీలక్ష్మణరెడ్డి ప్రమాణం
విజయవాడ: మౌలిక సదుపాయాల కల్పన రంగం సహా ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులను సైతం విచారించే దిశగా రాష్ట్రం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన హామీ మరొకటి కార్యరూపం దాల్చింది. లోకాయుక్త కమిషన్ ఛైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీ లక్ష్మణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ పీ లక్ష్మణ రెడ్డి ఇదివరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు ఉపాధ్యక్షునిగా ఉన్నారు. లోకాయుక్త కమిషన్ ఛైర్మన్ గా ఆయన అయిదేళ్ల పాటు కొనసాగుతారు.

తమకు అధికారం ఇస్తే రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేలా పరిపాలన చేస్తానని వైఎస్ జగన్ ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పీ లక్ష్మణ రెడ్డిని లోకాయుక్త ఛైర్మన్ గా నియమిస్తూ ఈ నెల 9వ తేదీ నాడే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పోలవరం సహా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన రంగంలో అవినీతిని పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుంది.


కాంట్రాక్టర్లకు చెల్లించే కోట్ల రూపాయల మొత్తంలో నుంచి కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గానీ అవినీతికి పాల్పడే లొసుగులు కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని అరికట్టడానికి వైఎస్ జగన్ లోకాయుక్తను ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, విచారించే అధికారం లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపై అయినా లోకాయుక్త విచారణ జరపవచ్చు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications