వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం : హాజరైన గవర్నర్ - సీఎం జగన్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కొత్త సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం విశాఖ నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ కార్యదర్శి సిసోడియా..ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వాగతం పలికారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబరు 16న సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఈ సిఫార్సులకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు.ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Justice Prashant Kumar Mishra has been sworn in as AP High Court CJ

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు.

ఆ తర్వాత అడ్వొకేట్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ హైకోర్టుకు మూడో ప్రధాన న్యాయమూర్తి గా ఇప్పుడు ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసారు.

English summary
Justice Prashant Kumar Mishra has been sworn in as AP High Court CJ.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X