వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్కరాల ప్రమాదానికి చంద్రబాబు కారణం కాదు: భక్తుల పిచ్చి, వారి దుష్ప్రచారమే

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు కారణంకాదు, భక్తుల పిచ్చివల్లే !

అమరావతి: ఏపీ శాసన సభ ముందుకు జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక వచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతికి గల కారణాలపై విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదికను సమర్పించింది. దీనిని మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

2015 జూలై 15వ తేదీన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. ఏకసభ్య కమిషన్ పలుమార్లు బహిరంగ విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది.

దేశంలోనే అత్యధిక సంపాదించే ఎమ్మెల్యేల్లో జగన్‌కు 5వ స్థానం, మన ఎమ్మెల్యేలు ఇలా..దేశంలోనే అత్యధిక సంపాదించే ఎమ్మెల్యేల్లో జగన్‌కు 5వ స్థానం, మన ఎమ్మెల్యేలు ఇలా..

వారి పిచ్చి నమ్మకమే ప్రమాదానికి కారణం

వారి పిచ్చి నమ్మకమే ప్రమాదానికి కారణం

ఒకే ముహూర్తంలో స్నానాలు చేయాలన్న పిచ్చినమ్మకం వల్లనే ప్రమాదం జరిగిందని కమిషన్ తన నివేదికలో పేర్కొందని తెలుస్తోంది. ప్రజలు గుడ్డి నమ్మకంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని అభిప్రాయపడింది. ఒకే ముహూర్తంలో స్నానాలు చేయాలనే సంప్రదాయం ఎక్కడా లేదన్నారు. ప్రచారం, రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది రాజకీయపరమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

ఇవి కూడా కారణాలు

ఇవి కూడా కారణాలు

ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300 మీటర్లు మాత్రమే ఉండటం, పుష్కర ముహూర్తం పైన అనవసర ప్రచారం వల్ల జనం రద్దీ పెరిగిందని, ఒకే ముహూర్తంలో స్నానాలు చేయాలనే నమ్మకం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భక్తుల పైకే నెట్టివేశారు.

జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియో సహా అన్నింటి పరిశీలన

జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియో సహా అన్నింటి పరిశీలన


ఇందుకు సంబంధించి నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియో సహా, అన్ని వీడియోలను పరిశీలించిన తర్వాత నివేదిక ఇచ్చినట్లు కమిషన్ పేర్కొంది. అధికారంలో లేని పార్టీలు, రాజకీయ శత్రుత్వం, ప్రతి అంశాన్ని విమర్శలకు వాడుకోవాలనుకోవడం కమిషన్ గమనించిందని పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం అందించిందని నివేదికలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని దోషిగా చూపే ప్రయత్నం

ముఖ్యమంత్రిని దోషిగా చూపే ప్రయత్నం

ముఖ్యమంత్రి చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు ఎక్కువమంది ప్రయత్నం చేశారని కమిషన్ అభిప్రాయపడింది. సీఎం వెళ్లిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. సుదీర్ఘ విచారణ అనంతరం నివేదిక సమర్పించిన కమిషన్... చంద్రబాబుది తప్పు లేదని చెప్పింది. ప్రచారం, రాజకీయ లబ్ధి కోసమే చాలామంది చంద్రబాబుపై ఆరోపణలు చేశారని తెలిపారు.

English summary
Justice Somayajulu Commission report before Andhra Pradesh Assembly on Godavari Pushkaralu on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X