సంవత్సరంలో ఒక సారే దక్కే అరుదైన దర్శనం..ముహూర్తం - ఇలా బుక్ చేసుకోండి..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వరుస సెలవుల కారణంగా రద్దీ మరింత గా పెరిగే అవకాశం ఉంది. ఉగాది, శ్రీరామ నవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్తానాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక, జూన్ నెలకు సంబంధించిన దర్శనం... వసతి టికెట్లను ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారు. కాగా.. శ్రీవారి ఆలయంలో మలయప్ప స్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఒక్కసారే నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవ ముహూర్తం.. భక్తులకు బుకింగ్ గురించి టీడీడీ వివరాలు వెల్లడించింది.
తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఏటా మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో అలరారే శ్రీవారి, దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఈ ఏడాది జ్యేష్టాభిషేక ఉత్సవాలు జూన్ 26 న మొదలై 28 తో పూర్తి కానున్నాయి. పరమ పవిత్రంగా భావించే ఈ జ్యేష్ఠాభిషేకం వేళ భక్తులకు ఈ అరుదైన ఉత్సవం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి భక్తులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఈ నెల 21వ తేదీన ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. దీంతో... శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తారీఖున నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ, వసంతోత్సవ సేవలను రద్దు చేసారు. అదే విధంగా జూన్ 21వ తేదిన నిజపాద దర్శనం, జూన్ 22న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జి బ్రహ్మోత్సవంను రద్దు చేస్తూ నిర్ణయించారు. తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీన ములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటుచేసిన ఉత్సవమే ఇది.
టికెట్ ధర.. ఇలా పొందే అవకాశం
కాగా, ఈ ఉత్సవాల్లో మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు అభిషేకాలు పంచామృత స్నపన తిరమంజనాదులు నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. యథాప్రకారంగా రెండవరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడవరోజు కూడ తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఈ బంగారు కవచ సమర్పణ మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంత వరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఇందుకు సంబంధించి చాలా పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో.. 9.50 గంటలకే టికెట్లు పొందే భక్తులు ఐడీ తో ఆన్ లైన్ లో బుకింగ్ కోసం సిద్దంగా ఉండాలి. ఇంటర్నెట్ వేగంగా ఉంటే మంచిం. టికెట్లు పొందేందుకు ఒకే సిస్టమ్ లో కాకుండా అందుబాటులో ఉన్న యాప్, పోర్టల్ ద్వారా ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. టికెట్ ధర రూ 400 గా నిర్ణయించారు. దీంతో.. ఈ అరుదైన అవకాశం పొందాలని భావించే వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది.
-
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!













Click it and Unblock the Notifications