సీజ్ ది షిప్ బియ్యం ఏమైంది, తెర వెనుక - టీడీపీ ఎమ్మెల్యే సంచలనం..!!
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన సీజ్ ది షిప్ వ్యవహారం ఏమైంది. బియ్యం అక్రమ రవాణా పై చేసిన ప్రకటనలు ఏమయ్యాయి. కాకినాడ లో అక్రమ బియ్యం రవాణా వ్యవహారం ఎందుకు చల్ల బడిపోయింది. ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్యుల్లో కాదు.. అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లోనూ సందేహంగా మారుతోంది. అసలు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ కామెంట్స్ చేస్తు న్నారు. అదే సమయంలో మంత్రులు ప్రకటనలకే పరిమితం కావటాన్ని నిలదీస్తున్నారు.
ఆ బియ్యం ఏమయ్యాయి
కాకినాడ పోర్టులో కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్.. మంత్రి మనోహర్ బియ్యం అక్రమ రవాణా పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ నేరుగా ఆ షిప్ పరీక్షించటానికి వెళ్లిన డిప్యూటీ సీఎం సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు. అప్పట్లో ఈ అంశం వైరల్ అయింది. ఆ తరువాత బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేస్తామని సిట్ ఏర్పాటు చేసారు. ఇక.. నాడు సీజ్ ది షిప్ అంటూ నిలిపివేసిన షిప్ ను కేంద్రం జోక్యంతో ఆఫ్రికాకు పంపిన ట్లు ఆ తరువాత స్పష్టం అయింది. ఇక.. మంత్రి మనోహర్ పలు ప్రాంతాల్లో బియ్యం కేంద్రాలను పంపిణీ చేసారు. కాగా, కాకినాడ పోర్టులో ఆ బియ్యం రవాణాలో ఎవరి పాత్ర తేల్చారు.. అసలు ఏం జరిగిందనేది టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలతో సంచలనంగా మారుతోంది.

నెహ్రూ వ్యాఖ్యలతో
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాకినాడ పోర్ట్ లో వ్యవహారం చల్లబడిపోయింది అంటున్నారని పేర్కొన్నారు. ఎందుకు చల్లబడిందో ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కేవలం ప్రకటన లకే పరిమితం కాకూడదని చెప్పుకొచ్చారు. రేషన్ వ్యవస్థ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసారు. అసలు 30 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇమ్మని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లిగల్ గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని జ్యోతుల వ్యాఖ్యానించారు. వారికి మనమే అవకాశం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. విజిలెన్స్ విచారణ, కేసులు వలన ఏంటి ఉపయోగమని జ్యోతుల కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎవరు అడిగారు
80 శాతం ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు. తినే బియ్యం ఇస్తే ప్రజలు ఎందుకు అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారంటూ నెహ్రూ వ్యాఖ్యానించారు. 50 శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుక్కోలేరా అంటూ వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యం కేజీ కి 13 రూపాయలు ఇచ్చేస్తామంటే సరిపోతుందా అంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక, ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి.. అధికారులు కాకినాడ బియ్యం పైన వచ్చిన ఆరోపణలు.. ఎగుమతుల అంశం పైన స్పష్టత ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications