సంస్కారం లేని వ్యక్తి జగన్: 'టీడీపీలో చేరడానికి డబ్బులు తీసుకోలేదు'

అమరావతి: అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైపీసీ నుంచి గెలిచి టీడీపీలోకి చేరిన జ్యోతుల నెహ్రూ ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ టీడీపీలో చేరడానికి తానేమీ డబ్బులు తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అంతేకాదు ఏపీ మంత్రి వర్గ విస్తరణలో అవకాశమివ్వమని తానేమీ అడగలేదని, వారే ఇస్తామంటున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. దీంతో పాటు వైసీపీ అధినేత వైయస్ జగన్ నాయకత్వం గురించి కూడా ఆయన స్పందించారు. 'నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం కూడా లేని వ్యక్తి జగన్' అంటూ విమర్శించారు.

 jyothula nehru on ys jagan over his behaviour in a tv channel

వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన వ్యక్తిని తానని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు. 'నా చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. కానీ, కింద ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చిన రోజున నేను ఉండను' అని ఆయన అన్నారు.

వైసీపీ నుంచి తాను తెలుగుదేశం పార్టీలోకి చేరడం వెనుక ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి పాత్ర ఉందని అన్నారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాతే తాను టీడీపీలోకి వస్తానని ఆ పార్టీ నేతలకు ముందుగానే ఆ పార్టీ నేతలకు చెప్పానని ఆయన అన్నారు.

వైసీపీ నేతలు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం పెద్ద సమస్యేమీ కాదని, రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని జ్యోతుల ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+