చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ప్యాకేజీ స్టార్స్..ఆ పార్టీ అధినేత సంచలన కామెంట్స్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. ముఖ్యంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీకు ప్యాకేజీ స్టార్‌లా మారాడని, చిరంజీవి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్‌లా మారిన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను వెలివేయాలా వద్దా అని కాపులను ఆయన ప్రశ్నించారు.
రాజకీయాల్లో సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారని, అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని,ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీలకి బానిసయ్యాడని చెప్పి కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గులేని వాళ్లు మాత్రమే " డిప్యూటీ సీఎం గారి తాలూకా " అని బోర్డు పెట్టుకుంటారని చెప్పి జనసేనను ఎద్దేవా చేశారు. సిగ్గు ఉన్న ప్రతీ ఒక్కరు ఛీ పవన్ కళ్యాణ్, పదవి కోసం మోడీ కాళ్ల మీద పడతావా అంటూ ప్రశ్నించాలని, కేఏ పాల్‌తో చేతులు కలపాలని పవన్ కల్యాణ్‌కు సూచించాలని జనసేన కార్యకర్తలకు కేఏ పాల్ పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ప్యాకేజీ స్టార్‌లా మారిపోయిందని ఆయన సెటైర్లు వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, అన్నపై ఫైట్ చేసేందుకు ఏపీకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యిందని విమర్శించారు.ప్రస్తుతం కేఏ పాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications