చంద్రబాబు సభలు ఆపుతారా లేదా ? హైకోర్టుకెళతా ! డీజీపీ ఆఫీసు దగ్గర కేఏ పాల్ హంగామా..
ఏపీలో తాజాగా నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 8 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కందుకూరు వెళ్లి మరీ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
ఇవాళ కేఏ పాల్ ఇదే అంశంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు మంగళగిరికి వచ్చారు. మంగళగిరి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్.. కందుకూరు ఘటనపై చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, తదుపరి సభలకు అనుమతి ఇవ్వకూడదని ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పాల్ ను పోలీసులు లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కాసేపు పాల్ వాగ్వాదానికి దిగారు.
చంద్రబాబు సభలు ఆపుతారా లేదా ? హైకోర్టుకెళతా ! డీజీపీ ఆఫీసు దగ్గర కేఏ పాల్ హంగామా..#andhrapradesh, #guntur, #mangalagiri, #kapaul pic.twitter.com/Sgz2L2US4q
— oneindiatelugu (@oneindiatelugu) December 30, 2022

కార్ లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు డీజీపీ కార్యాలయం ఎదుట హడావుడి చేసిన కే.ఏ పాల్... అనంతరం.. డీజీపీ కార్యాలయం బయటే చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు చనిపోయినా సభలకు అనుమతి ఇవ్వడం దుర్మార్గమని పాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు.
చంద్రబాబు సభలు ఆపుతారా లేదా ? హైకోర్టుకెళతా ! డీజీపీ ఆఫీసు దగ్గర కేఏ పాల్ హంగామా..#andhrapradesh, #guntur, #mangalagiri, #kapaul pic.twitter.com/3QZgcKMPyu
— oneindiatelugu (@oneindiatelugu) December 30, 2022
చంద్రబాబుపై డీజీపీ చర్యలు తీసుకోవాలని, తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని పాల్ హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో నియంత పాలన నడుస్తుందని కూడా పాల్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications