జగన్‌కు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌- పరీక్షలపై హైకోర్టుకు-సీఎం, మంత్రులపై షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతీ రోజూ దాదాపు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్దితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. సీఎం జగన్, మంత్రులపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఓ ఆఫర్‌ కూడా ఇచ్చారు. మరోవైపు పది, ఇంటర్ పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేఏ పాల్‌ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.

కరోనా విలయంపై కేఏ పాల్‌ ఫైర్‌

కరోనా విలయంపై కేఏ పాల్‌ ఫైర్‌

ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. విశాఖలో ఆక్సిజన్‌ అందక ఏడాది పాప చనిపోవడం బాధాకరమని కేఏ పాల్‌ తెలిపారు. కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందని పాల్‌ అన్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, కుంభమేళా జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రబలడానికి ఎన్నిక సంఘం, రాజకీయ నేతలు కారణమైనట్లు పాల్‌ విమర్శించారు.

 టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్

టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్

ఏేపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించాలనుకోవడం అవివేకమని కేఏ పాల్‌ తెలిపారు. విద్యార్ధుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పాల్‌ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేసినా ఇక్కడ కొనసాగించాలనుకోవడం సరికాదని పాల్‌ తెలిపారు. అందుకే పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పాల్‌ విజయవాడలో వెల్లడించారు.

జగన్‌, మంత్రులు పిల్లల్ని పరీక్షలకు పంపుతారా ?

జగన్‌, మంత్రులు పిల్లల్ని పరీక్షలకు పంపుతారా ?


కరోనాలో ఏపీ ప్రభుత్వం టెన్త్‌ పరీక్షల నిర్వహణకు మొండిగా ముందుకెళ్లడాన్ని కేఏ పాల్‌ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్, మంత్రుల్ని టార్గెట్‌ చేస్తూ నేరుగా విమర్శలు గుప్పించారు. జగన్‌, మంత్రులు ఇలాంటి పరిస్ధితుల్లో తమ పిల్లల్ని పరీక్షలకు పంపుతారా అని కేఏ పాల్‌ ప్రశ్నించారు. మీ పిల్లలవే ప్రాణాలా అని వారిని పాల్ నిలదీశారు. రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ,ఫైటింగులు కాదని విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమని పాల్‌ తెలిపారు.

జగన్‌కు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌

జగన్‌కు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌

ఏపీలో నెలకొన్న కరోనా పరిస్ధితుల నేపథ్యంలో కేఏ పాల్‌ ఏపీ ప్రభుత్వానికీ, ముఖ్మమంత్రి జగన్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు. కరోనా చికిత్సల కోసం తన భవనాలు, అందులో బెడ్లను వాడుకోవాలని పాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి వెయ్యి బెడ్లు ఇస్తానని కేఏ పాల్‌ ఆఫర్ చేశారు. దీంతో పాటు ఏపీకి ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విదేశీ నేతలను కోరినట్లు పాల్‌ తెలిపారు. తనకున్న పరిచయాలతో ఈ మేరకు వారిని కోరినట్లు పాల్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+