ఏయ్.. కేఏ పాల్ మళ్లీ ఏసేశాడుగా..!!
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కును అమ్మకుండా అడ్డుకోవాలని తన పిల్ లో కోరారు. కంపెనీ లాభాలబాటలోనే ఉందని, ప్రయివేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేట్ పరం చేయడాన్ని అన్ని కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.
విరాళాలు సేకరిస్తాను : స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా విరాళాలు సేకరిస్తామని, అందుకు కేంద్రం అనుమతిచ్చేలా కోర్టు ఆదేశించాలని కోరారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్, లాభనష్టాలను పరిశీలించేందుకు తెలుగు తెలిసిన విశ్రాంత జడ్జిని నియమించాలని కోరారు. కంపెనీ విక్రయానికి సంబంధించిన సమాచారం తనదగ్గర ఉందని, ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.

రూ.4వేల కోట్ల సాయం అందిస్తా : ప్లాంట్ ను నామమాత్రపు ధరకు అమ్మకుండా ఆదేశాలివ్వాలన్నారు. కంపెనీని ప్రయివేటీకరిస్తే తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. విశాఖ ఉక్కును రక్షించేందుకు తనవంతుగా రూ.4వేల కోట్ల సాయం అందిస్తానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల అప్పులు తీర్చేస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తెస్తే ప్రతి గ్రామానికి కోటిరూపాయల వంతున ఇస్తానన్నారు.
అందరూ ప్రజాశాంతివైపు చూస్తున్నారు : రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లాయని, అందరూ ప్రజాశాంతి పార్టీవైపు చూస్తున్నారని, తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తీరుతో ప్రజలు విసిగిపోయారని, దేశంలో అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించాలన్నారు. తన పార్టీని ప్రజలే నడిపించాలని, అందుకే తాను ప్రజల నుంచి విరాళాలు అడుగుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications