తెలివైన వాడు ఎవడూ జనసేనలో చేరడు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలోని కూటమి నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ , జనసేన పార్టీలు ఇకపై జీవితంలో గెలవవు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జనసేన, పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై ఆయన స్పందించారు. పిఠాపురం టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై కేఏ పాల్ మాట్లాడారు.
తాను చెప్పినట్టే పవన్ కల్యాణ్ చేశాడని, ఎమ్మెల్సీని తన అన్న నాగబాబుకు ఇచ్చుకున్నాడని అన్నారు. గత ఎన్నికల సమయంలో, నువ్వు పోటీ చేయకుండా పవన్‌కు సహకరించు అని వర్మకు చెప్పారని, కానీ ఇప్పుడు తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తే టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్ధానం చేశాడని, కానీ ఇప్పుడు చేతులు ఎత్తేశాడని చంద్రబాబును ఉద్దేశించి కేఏ పాల్ మాట్లాడారు.

"ఆ వర్మ ఏమో... అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అంటూ అమరావతిలో పవన్ కల్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. బుద్ధుందా వర్మా... వాళ్లు మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పానంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మళ్లీ జనసేనలో చేరారని, అసలు ఆయనకు బుద్ది ఉందా అంటూ.. తెలివైన వాళ్లు ఎవరు కూడా ఆ పార్టీలో చేరరని ఆయన అన్నారు. మళ్లీ జనసేన గానీ, టీడీపీ గానీ గెలుస్తాయా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్ అంటూ విమర్శల వర్షం కురిపించారు కేఏ పాల్.












Click it and Unblock the Notifications