అవినాష్ తల్లికి కేఏ పాల్ పరామర్శ-విమలమ్మ ఇంటర్వ్యూ చూసి-వైఎస్ ఫ్యామిలీతో బంధం..

అనారోగ్యంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ కర్నూలు ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేసి ఆకాంక్షించారు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం వెంటనే కోలుకునేలా భగవంతున్ని ప్రార్థించానని ప్రజాశాంతి అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. అవినాష్ రెడ్డితో తాను మాట్లాడిన సమయం లో ఆయన వ్యవహరించిన తీరు ఆయన్ను నిరపరాధిగా నిలుపుతుందని పాల్ చెప్పుకొచ్చారు. గతంలో తాను శాంతి సభలో నిర్వహించిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మి తో పాటు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ కూడా పాల్గొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు.

ka paul visits ys avinashs mother in kurnool hospital

కర్నూలు ఆస్పత్రికి వచ్చి అవినాష్ తల్లిని పరామర్శించడం వెనుక కారణాన్ని కూడా కేఏ పాల్ వెల్లడించారు. తాను ఎన్నికల ప్రచారం కోసం టర్కీ వెళ్లాల్సి ఉన్నా, వైయస్ వివేకానంద రెడ్డి సోదరి విమలమ్మ ఇంటర్వ్యూ ను మీడియాలో చూసి అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు వైజాగ్ నుండి తరలివచ్చానన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులతో కేఏ పాల్ కాసేపు మాట్లాడారు.

వివేకా కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు పాల్ తెలిపారు. రాజకీయంగా వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబంపై గతంలో విమర్శలు చేసిన పాల్.. ఇవాళ మాత్రం అవినాష్ తల్లిని పరామర్శించేందుకు ఆస్పత్రికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో పాల్ రాజకీయ విమర్శలు కూడా చేయకుండా సైలెంట్ గానే ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+