తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోనున్న డబుల్ డెక్కర్ రైలు!

విజయవాడ: తెలంగాణలోని కాచిగూడ నుంచి తిరుపతి, గుంటూరు మధ్య తిరుగుతున్న డబుల్ డెక్కర్ రైలును ఏపీకి తరలించి, విశాఖ నుంచి తిరుపతి మధ్య నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదని చెబుతున్నారు.

 Kacheguda-Tirupati Double Decker Express may shift to AP

రైలు ఖాళీగా తిరుగుతోందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి డబుల్ డెక్కర్ ఏసీ రైళ్ల కోసం చాలా రాష్ట్రాలు ప్రయత్నించాయి. తెలంగాణ ప్రభుత్వం లాబీయింగ్ ద్వారా ఈ రైలు కాచిగూడకు వచ్చింది.

ఇది కాచిగూడ నుంచి తిరుపతికి రెండ్రోజులు, కాచిగూడ నుంచి గుంటూరుకు రెండ్రోజుల పాటు రాకపోకలు సాగిస్తుంది. అయితే, రైలు చాలా వరకూ ఖాళీగానే తిరుగుతోంది. దీంతో, ఈ రైలును తెలంగాణ నుంచి ఏపీకి చేర్చి విశాఖ నుంచి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరుల మీదుగా తిరుపతికి నడిపితే ప్రయాణికుల స్పందన ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+