చంద్రబాబు సర్కార్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కాదంబరీ జెత్వానీ..! చావు కబురు చల్లగా..

ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మరో ఇద్దరు కింది స్థాయి పోలీసు అధికారుల్ని కూడా సస్పెండ్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా కాదంబరీ జెత్వానీపై గతంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆ కేసే ఇప్పడుు కీలకంగా మారిపోయింది.

ఇవాళ సచివాలయానికి తన లాయర్లతో కలిసి వచ్చిన కాదంబరీ జెత్వానీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. అప్పట్లో వైసీపీ పెద్దల ఆదేశాలతో ఐపఎస్ లు తనను ఎలా వేధించారో వివరించారు. తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అలాగే అప్పట్లో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్ లో తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై హోంమంత్రి అనిత ఆమెకు నేరుగా హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పంపినట్లు తెలుస్తోంది.

Kadambari jatwani shocker to ap government request to withdraw case against her to file another

అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. హోంమంత్రితో భేటీ తర్వాత బయటికి వచ్చిన కాదంబరి లాయర్ నర్రా వెంకటేశ్వరరావు అసలు విషయం బయటపెట్టారు. ఏపీలో కాదంబరిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే ఇందుకు కారణమైన ముంబైలో పారిశ్రామికవేత్తపై తాము ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఇదే టర్నింగ్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సన్నిహితుడైన ఆ పారిశ్రామిక వేత్తను వదిలేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆమెను క్షేత్రస్దాయిలో వేధించిన ఐపీఎస్ లను మాత్రమే సస్పెండ్ చేసింది.

Kadambari jatwani shocker to ap government request to withdraw case against her to file another

ఇప్పుడు కాదంబరి కోరినట్లుగా ఆమెపై కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికే ఆమె హనీట్రాప్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తే ముంబైలో సదరు పారిశ్రామికవేత్తపై ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+