Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సీఎంవో కేంద్రంగా జెత్వానీపై కుట్ర! డీజీపీ సంచలన రిపోర్ట్-ఐపీఎస్ ల అరెస్ట్?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగనన్ కు సన్నిహితుడైన ఓ ముంబై పారిశ్రామికవేత్తను కాపాడే క్రమంలో నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి ఆమెను కుటుంబంతో సహా వేధించిన కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.

జెత్వానీనీ వేధించిన వ్యవహారంలో తాజాగా అరెస్టు అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అప్పట్లో ఏం చేశారో డీజీపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికలో అప్పటి సీఎంవో కేంద్రంగా సాగిన కుట్ర బట్టబయలైంది.

Kadambari jethwani harassment plan hatched in ap cmo- shocking facts in dgp report

ఈ ఏడాది జనవరి 31న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీని సీఎంవోకు పిలిపించడంతో ఈ కుట్ర మొదలైంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అరెస్టు చేయాలంటూ కాంతి రాణా టాటాకు పీఎస్సార్ ఇచ్చిన మౌఖిక ఆదేశం ఇందులో కీలకమైనది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఆమెపై కేసు నమోదు చేశారు. అంటే కేసు నమోదు కూడా కాకుండానే జెత్వానీ అరెస్టుకు ఆదేశాలు వెళ్లాయి.

పీఎస్సార్ చెప్పిన నోటిమాట ఆధారంగానే కాంతిరాణా టాటా జెత్వానీ అరెస్టుకు ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించేశారు. జనవరి 31న జెత్వానీని అరెస్టు చేయాలని కాంతిరాణా టాటా డీసీపీ విశాల్ గున్నీని ఆదేశిస్తే ఆయన ఫిబ్రవరి 1నే అంటే అరెస్టుకు ముందే పోలీసులు ముంబైకి వెళ్లేందుకు టికెట్లు కూడా తీశారు. మొత్తం మీద పీఎస్సార్ నోటిమాటతోనే ముంబైలో ఉన్న జెత్వానీని అరెస్టు చేసేందుకు విజయవాడ కమిషనరేట్ పోలీసుల టీమ్ ముంబైకి వెళ్లడం, ఆమెను అక్రమ కేసులో అరెస్టు చేయడం, విజయవాడ తీసుకొచ్చి వేధించడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి.

దీనిపై డీజీపీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పీఎస్సార్ తో పాటు ఈ వ్యవహారాన్ని నడిపించిన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది. ఇప్పుడు వీరిని అరెస్టు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెత్వానీ నేరుగా చేసిన ఫిర్యాదు ఆధారంగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడుతోంది. త్వరలో మరింత మందిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే జరిగితే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+