ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసుపై మహిళా కమీషన్ షాకింగ్ రియాక్షన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నటి కాదంబరి జెత్వాని కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనతో పెళ్లికి నిరాకరించానన్న కారణంతో వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశారని, ముంబై నటి కాదంబరి జత్వాని పేర్కొన్నారు. అప్పటి విజయవాడ సిటీ కమీషనర్ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో సుమారు 15 మంది ఏపీ పోలీసు అధికారులు తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు.

కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
తనపై తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిత్వహనడానికి పాల్పడ్డారని విజయవాడ పోలీసు కమిషనర్ ను కలిసి ముంబై నటి కాదంబరి జెత్వాని తనపై జరిగినటువంటి వేధింపులను గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు పైన విజయవాడ పోలీస్ కమిషనర్ సీరియస్ గానే దృష్టి సారించి విచారణ చేస్తున్నారు.

Kadambari Jethwani molestation case Shocking reaction by AP Women Commission

ఏపీ మహిళా కమీషన్ షాకింగ్ రియాక్షన్
ఈ క్రమంలో తాజాగా నటి కాదంబరీ జెత్వానీ కేస్ పైన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఓ నటీమణిని ఏపీలోని రాజకీయ నాయకులు వేధింపులకు గురి చేయడం పైన రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోవడం పైన పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

ఈ కేసుతో మాకు సంబంధం లేదన్న మహిళా కమీషన్ చైర్ పర్సన్
నటి కాదంబరి జెత్వానీ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును తాము సుమోటోగా ఎందుకు తీసుకోలేదో ఆమె వివరించారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలిపారు. కాదంబరి జెత్వాని ఉన్నత చదువులు చదువుకున్న మహిళ అని, ఆమె ఈ విషయంలో మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తే బాగుండేదని పేర్కొన్నారు.

తాము సుమోటోగా తీసుకోలేమన్న మహిళా కమీషన్
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమపై జరిగిన వేధింపులపైన మహిళా కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే అప్పుడు తాము ఈ వ్యవహారం పైన దృష్టి సారిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల మహిళలకు సంబంధించిన వేధింపుల కేసును తాము సుమోటోగా తీసుకోలేమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు.

తమను ఆశ్రయిస్తే చర్యలు తీసుకుంటాం
ఆమె ముందుగా తమను ఎందుకు ఆశ్రయించలేదో తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముంబై నటి కాదంబరి జెత్వాని మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+