ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల ''వెన్నుపోటు''
తెలుగుదేశం పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రమణయ్య యాదవ్ నామినేషన్ వేయడంతో ఎన్నికలు తప్పవని అందరూ భావించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. స్థానిక సంస్థల్లోని 98 శాతం మంది వైసీపీకి చెందినవారే. మిగతావారంతా స్వతంత్రులు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఓట్లు 60 వరకు ఉంటాయి. ఎంత పోరాటం చేసినప్పటికీ వైసీపీ నుంచి ఒక్కటైనా అదనపు ఓటు దక్కడం దాదాపు అసాధ్యం. ఈ సంగతి జిల్లా నేతలకు తెలుసు.

ఎన్నికలు తప్పవని భావించారు..
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కాకూడదని పార్టీ ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రమణయ్య యాదవ్ నామినేషన్ వేయడంతో ఎన్నికలు తప్పవని అందరూ భావించారు. అయితే రమణయ్య నామినేషన్ స్క్రూటినీలో తీసేయడంతో టీడీపీ కథ అడ్డం తిరిగింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు చర్చకు వచ్చాయి. రమణయ్య యాదవ్ నామినేషన్ లో సంతకాలు తాము చేయలేదని ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రమణయ్యపై క్రిమినల్ కేసు?
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏకైక టీడీపీ కౌన్సిలర్ గా ఉన్న శివజ్యోతి, మైదుకూరు మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లు వెంకటసుబ్బారెడ్డి, ఖాదర్ బాషా ఈ ముగ్గురు. రమణయ్య యాదవ్ తోపాటు జిల్లా టీడీపీ నేతలు షాక్ తిన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసి.. తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రమణయ్య ఇప్పుడు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది. వైసీపీ ప్రలోభ పెట్టి తన ముగ్గురు కౌన్సిలర్లతో తప్పుడు ఫిర్యాదు చేయించిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరు రివర్స్ కావడంలో టీడీపీకే చెందిన మైనారిటీ నాయకుడు, మరో మండలస్థాయి నాయకుడు కీలక పాత్ర పోషించినట్లు చర్చ జరుగుతోంది.

పార్టీకి షాకిచ్చిన కౌన్సిలర్లు
కౌన్సిలర్ శివజ్యోతి భర్త కుతుబుద్దీన్ టీడీపీకి చెందిన టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు. అలాంటి నాయకుడి సతీమణే ప్లేటు ఫిరాయించడంతో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని కౌన్సలిర్ల తీరు నేతలకు షాకిచ్చింది. ఒకరకంగా పార్టీకి తలవంపులు తెచ్చేలా సీనియర్ నాయకులు వ్యవహరించారని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నామినేషన్ కు పురమాయించిన నేతలు సీరియస్ గా వ్యవహరించలేదని అర్థమవుతోంది. బలం లేనిచోట అభ్యర్థిని పోటీకి పెట్టినప్పుడు ప్రజాప్రతినిధుల కదలికలపై నిఘా పెట్టడంతోపాటు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే పార్టీ సీనియర్ నేతల మధ్య సమన్వయలోపంతో పాటు వారు సీరియస్ గా తీసుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ భంగపడింది.
-
తిరుమల నెయ్యి ట్యాంకర్ బోల్తా -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications