"ఎన్టీఆర్ అత్యంత కుమిలిపోయిన సందర్భం అదే.., బాబు తీరు అలా కనిపించడం లేదు"
నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకున్న సమయంలోనే ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేనంతగా బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు.
విజయవాడ: టీడీపీతో తన అనుబంధం.. ఎన్టీఆర్ తర్వాత పార్టీ వైఖరిపై సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేసిన సందర్భంగా మాట్లాడారు.
టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరినైన తనను సలహాల కోసం ఆ పార్టీ ఏనాడూ సంప్రదించలేదన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ అవలంభిస్తున్న వైఖరిపై ఆయన పెదవి విరిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నాలు:
టీడీపీ ప్రారంభం నుంచి తాను ఎన్టీఆర్‌తో కలిసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నించారని కైకాల చెప్పారు. అయితే కొన్ని ప్రతికూల కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదన్నారు.

అత్యంత కుమిలిపోయిన సందర్భం:
కానీ ఆ తర్వాతి రోజుల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని గుర్తుచేశారు. సీనియర్ ఎన్టీఆర్ తనను నమ్ముకున్నవాళ్లకు ఏదో ఒకటి చేశారని చెప్పుకొచ్చారు. 'నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకున్న సమయంలోనే ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేనంతగా బాధపడ్డారని' గుర్తు చేసుకున్నారు.

బాబు తీరు అలా లేదు:
ఇక అవార్డుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పురస్కారాల కోసం చాలా లాబీయింగ్ చేయాల్సి ఉంటుందని, అది తనకు ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వమే నామినేట్ చేయాలని, కానీ వాళ్లు మాత్రం పార్టీ సభ్యుడివి అన్న సాకుతో దాని గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 'సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని' అన్నారు.

పార్టీతో సంబంధం ఉన్నవాళ్లే:
ప్రస్తుతం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను దక్కించుకున్నవాళ్లంతా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉన్నవాళ్లేనని గుర్తుచేశారు. పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. నటనను ఓ తపస్సులా భావించాలని చెప్పుకొచ్చారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications