బాబు దయ, జైల్లో అంతా వైసీపీ వాళ్లేగా..! రిలీజ్ కాగానే కాకాణి సంచలనం..!

మద్యం, మైనింగ్ సహా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయి నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎట్టకేలకు విముక్తి లభించింది. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా కాకాణి కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారం నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని...సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కున్న ఆస్తి ప్రజలు, అభిమానం అన్నారు.జిల్లా కేంద్ర కారాగారం లో అందరూ వైసీపీ వారేనంటూ ఆయన బాంబు పేల్చారు. జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు నాయుడు దయవల్ల జైల్లో వైసీపీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందన్నారు.

Kakani Govardhan Reddy Freed from Nellore Jail Claims It s All YSRCP Inside

హైకోర్టు బెయిలు మంజూరు చేసిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం చేశారని అధికారులపై కాకాణి ఆరోపణలు చేశారు. తన నిన్న సాయంత్రం ప్రజలు వచ్చారని, ఈరోజు ఉదయం కూడా వచ్చారని ఆయన తెలిపారు. ప్రజల అభిమానం మర్చిపోలేనిదన్నారు. నెల్లూరు జిల్లా లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారి అని కాకాణి తెలిపారు.

తనపై 6 సోషల్ మీడియా కేసులు పెట్టారని కాకాణి తెలిపారు. ఓట్లు వేస్తే లిక్కర్ ఇస్తా అని తాను చెప్పానని హాస్యాస్పదంగా లిక్కర్ కేసులను నమోదు చేశారన్నారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మానసికంగా ధైర్యంగా ఉన్నానని కాకాణి తెలిపారు. సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే, సోమిరెడ్డి, ఆన కొడుకు చేసే తప్పులను కచ్చితంగా ఎత్తిచూపుతానని కాకాణి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+