kakinada corporation : వైసీపీ కక్కుర్తి రాజకీయం-ఏడాదే గడువు-టీడీపీ జంపింగ్స్ తో అవిశ్వాసం
ఏపీలోని స్మార్ట్ సిటీ కలిగిన కార్పోరేషన్లలో ఒకటైన కాకినాడలో వైసీపీ కక్కుర్తి రాజకీయానికి తెరలేపింది. విపక్షంలో ఉండగా. ఫిరాయింపులపై నానా యాగీ చేసిన జగన్ పార్టీ ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. టీడీపీ నేతృత్వంలోని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కేవలం ఏడాది మాత్రమే గడువు మిగిలి ఉన్నప్పటికీ అంతలోనే వీరిని గద్దె దింపేందుకు ఏకంగా టీడీపీ నుంచి కార్పోరేటర్ల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు ఇఫ్పుడు మేయర్, డిప్యూటీ మేయర్లను పదవుల నుంచి తప్పించేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టేసింది.

కాకినాడ కార్పోరేషన్
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని మున్సిపల్ కార్పోరేషన్ కు 2017లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఉన్న 50 సీట్లలో టీడీపీ ఏకంగా 33 సీట్లు గెల్చుకుంది. వైసీపీకి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. ఇతరులు మిగిలిన సీట్లు దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ మేయర్ గా సుంకర పావని ఎంపి చేసింది. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబు ఎంపికయ్యారు. వీరిద్దరూ పదవుల్లో కొనసాగుతుండగానే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాకినాడతో మరికొన్ని కార్పోరేషన్లు మినహా మిగిలిన వాటికి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వీటిని వైసీపీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది అయితే కాకినాడ కార్పోరేషన్ లో మాత్రం టీడీపీ అధికారంలో ఉండటం వైసీపీకి కంటగింపుగా మారింది.

వైసీపీ ఫిరాయింపుల రాజకీయం
రాష్ట్రంలో అధికారంలో ఉండటం, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించడంతో వైసీపీ నేతలకు ఇక కాకినాడ కార్పోరేషన్ పై కన్ను పడింది. అంతే అక్కడి టీడీపీ కార్పోరేటర్లకు వల వేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరుగా వైసీపీ వైపు ఫిరాయించడం మొదలుపెట్టారు. అంతే అక్కడ టీడీపీ బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు వైసీపికి ఉన్న 10 మందితో పాటు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న వారు,ఇతరులతో కలుపుకుంటే వారి బలం 33కు పెరిగింది. దీంతో టీడీపీ మేయర్, డిప్యూటీ మేయర్లను తప్పించేందుకు రంగం సిద్ధం చేసేశారు.

ఏడాదే గడువున్నా...
వాస్తవానికి కాకినాడ కార్పోరేషన్ గడువు వచ్చే ఏడాదితో పూర్తి కాబోతోంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికలు నిర్వహించాల్సిందే. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకునే స్వేచ్చ ఉంది. అయినా వైసీపీ మాత్రం కక్కుర్తి రాజకీయానికి తెరలేపింది. ఏడాది మాత్రమే గడువున్నా లెక్క చేయకుండా టీడీపీ మేయర్, డిప్యూటీ మేయర్లను గద్దె దింపేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇఛ్చింది. కార్పోరేషన్లో ఇప్పుడు టీడీపీ బలం 10కి పడిపోవడం, వైసీపీ, టీడీపీ ఫిరాయింపు కార్పోరేటర్లు, ఇతరులతో కలుపుకుంటే 33 మంది ఉన్నారు. మరో ముగ్గురు కార్పోరేటర్లు చనిపోయారు. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్, డిప్యూటీ మేయర్లను సాగనంపేందుకు వైసీపీ పావులు కదుపుతోంది.

వైసీపీ సిద్ధాంతాలకు తిలోదకాలు ?
గతంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం లాక్కుందని వైసీపీ నానా యాగీ చేసింది. ప్రధాని, రాష్ట్రపతులకు కూడా ఫిర్యాదులు చేసింది. తాము అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి ఫిరాయింపుల్ని పోత్సహించబోమని వైసీపీ అధినేతగా జగన్ పదే పదే చెప్పారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చే వారు తమ పదవులు వదులుకుని రావాలని చాలా కథలే చెప్పారు. కానీ ఇప్పుడు కాకినాడ కార్పోరేషన్లో మాత్రం ఆ సిద్ధాంతాలన్నింటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అధికారం చేతిలో ఉందన్న అహంభావంతో టీడీపీ మేయర్, డిప్యూటీ మేయర్లను సాగనంపేందుకు సిద్దమైపోయారు. అధికార పార్టీ తల్చుకుంటే అధికారులు మాత్రం చేసేదేముంది. వారు కూడా అక్టోబర్ 5న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ తంతు పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇచ్చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications