కాకినాడ పోర్టులో భారీ ట్విస్ట్ లు- పుదుచ్చేరి సహా 6 రాష్ట్రాల దందా .. !
ఏపీలోని కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ టూర్, రేషన్ బియ్యం ఎగుమతులపై కన్నెర్ర చేసిన తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. అప్పటి వరకూ పట్టుకున్న బియ్యాన్ని లైట్ తీసుకున్న వారంతా ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భారీ ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీగ లాగితే డొంక కదిలినట్లు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం ఆరు రాష్ట్రాలు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. అలాగే ఓ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ ఘడ్, బీహార్, జార్ఖండ్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టుకు చేరుకుని ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 13 కేసులు నమోదు చేసి 137 మిల్లులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులోనే ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం ఆరు రాష్టాలు, పుదుచ్చేరి లో మిల్లుల నుంచి ఇలా బియ్యం ఎగుమతి చేస్తున్న సంస్థలకు చేరుతున్నట్లు తేలింది. ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా కొంతమంది వ్యక్తులు రేషన్ మాఫియాను నిర్వహిస్తూ ఈ ఎగుమతుల వెనుక ఉన్నట్లు సమాచారం. దీంతో ఇదంతా కేంద్ర, రాష్ట్రాలకు తెలిసి జరుగుతుందని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications