కళానికేతన్ ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులను మోసం చేసి అరెస్టైన కేసులో కళానికేతన్ ఎండీ లీలాకుమార్ విచారణలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

వందల కోట్లకు టోకరా: కళానికేతన్ ఎండి సహా భార్య అరెస్టు

కోట్ల రూపాయలు విలువ చేసే చేనేత వస్త్రాలను నేత కార్మికుల నుంచి సేకరించిన లీలా కుమార్, వారికి డబ్బు చెల్లించడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో ధర్మవరంలోని చేనేత కార్మికుల ఫిర్యాదు మేరకు తొలుత ఆయన సతీమణి, కళానికేతన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మీశారదను అరెస్ట్ చేసిన పోలీసుల ఆ తర్వాత ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కళ్లు గప్పి తిరుగుతున్న కళానికేతన్ ఎండి అరెస్టు

కళానికేతన్ సంస్ధ స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నేత కార్మికుల బకాయిలు చెల్లించే ఆర్థిక స్తోతమ తనకు లేదని లీలాకుమార్ చెప్పారని తెలిసింది. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని ఆయన చెప్పడంతో మరి ఆస్తుల మాటేమిటని పోలీసులు ప్రశ్నించారు.

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

దీంతో నీళ్లు నమిలిన లీలా కుమార్ అనంతరం వెల్లడించిన వివరాలను తెలుసుకుని పోలీసులు షాక్‌కు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కళానికేతన్ షోరూంలతో పాటు సంస్ధకు చెందిన స్ధిరాస్తులన్నీ కూడా తనఖాలోనే ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ కేసును ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టై జెైలు జీవితం గడుపుతున్న కళానికేతన్ సంస్ధ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్న లక్ష్మీశారద తనకు బెయిల్ మంజారు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ధర్మవరం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆమెకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

శనివారం ఆమె అనంతపురం జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సంస్ధ ఎండీ లీలా కుమార్ మాత్రం ఇంకా పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. గత నెలలో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులకు ఆయన విచారణలో ఏమాత్రం సహకరించలేదట.

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

కళానికేతన్ కేసులో ట్విస్ట్: తనఖాలో సంస్థ ఆస్తులు, లక్ష్మీ శారదకు బెయిల్

దీంతో మరోమారు లీలా కుమార్ ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వినతికి కూడా ధర్మవరం కోర్టు అంగీకరించింది. దీంతో శుక్రవారం ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై విచారించారు. తాజాగా సంస్థకు ఆస్తులున్న ప్రాంతాలకు ఆయనను తీసుకెళ్లి విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
kalaniketan md leela kumar wife got bail from hindupuram court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి