నారా లోకేష్ భూములు కొన్నాడని అంటారా, వైసిపిలో వణుకు: కాల్వ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తమ పార్టీ నాయకుడు నారా లోకేష్ కొన్నాడని అంటారా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను ప్రశ్నించారు. తమ పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్రచౌదరి కోర్టుకు ఎక్కడంతో వైసిపి నేతల్లో వణుకు పుట్టిందని ఆయన అన్నారు.
అవినీతి సొమ్ముతో ఏర్పాటుచేసిన పత్రిక, ఛానెల్ ద్వారా దుష్ప్రచారం చేస్తూ మీడియాను వైసిపి అధినేత జగన్ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అసత్యాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా సత్యమనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు.

అవినీతికి జగన్, అక్రమాలకు బొత్స ప్రతిరూపాలుగా నిలుస్తారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బొత్స వేలాది ఎకరాలు కొన్నారని ఆయన ఆరోపించారు.
ముద్రగడ అవమానిస్తున్నారు...
ఇదిలావుంటే, కాపులను కించపరిచేలా ముద్రగడ వ్యవహరిస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనే ముద్రగడ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినా మళ్లీ దీక్ష చేస్తాననటం సరికాదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications