నిజామాబాద్ నుండి కల్వకుంట్ల కవిత పోటీ, దానం ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ నుండి లోకసభకు ఆమె తెరాస నుండి పోటీ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఆమె పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెసు పార్టీ నేత మధుయాష్కీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత తెరాస నుండి, మధుయాష్కీ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేయనున్నారు.

తెరాసపై దానం నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి పైన మాజీ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం నిప్పులు చెరిగారు. తెరాస రాబందుల్లా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఎంతోమంది విద్యార్థి ఐకాస, తెలంగాణ ఐకాస నేతలు ఉండగా.. ఇతర పార్టీల నేతలను కెసిఆర్ తన పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తానని చెప్పా మాట తప్పారన్నారు. కెసిఆర్ ఓ నమ్మక ద్రోహి అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా కెసిఆర్ కొత్త నినాదాలు పైకి తీసుకు వస్తున్నాడని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు తెరాసకు విరాళాలు ఇవ్వవద్దన్నారు. తెలంగాణలో తెరాస ఎక్కడుందని, ముప్పై నలభై స్థానాలకు మించి గెలవదన్నారు. కెసిఆర్‌కు అధికారం పగటి కల అన్నారు. తెరాసలో తన కొడుకు, అల్లుడు, కూతురు తర్వాత ఇప్పుడు మనవడిని తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.
నా వల్లే ఎపి ప్రపంచపటంలోకి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తనదేనని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వేరుగా అన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లో కాంగ్రెసు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. సీమాంధ్రలో జగన్ పార్టీ అడ్రస్సు గల్లంతయ్యే పరిస్థితి ఉందన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సామర్థ్యం తనకే ఉందన్నారు. టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications