కన్నీళ్లొస్తున్నాయ్, ఈ ఫీలింగ్..: భర్తతో కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తాము కలలు కన్న తెలంగాణ అవతరణ చూస్తుంటే తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అన్నారు. ఆమె తొలిసారి సచివాలయానికి ఎంపీగా వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ అవతరణ చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. ఈ ఫీలింగ్ వర్ణణాతీతమన్నారు. తాము ఇది వరకు ముట్టడి కోసం సచివాలయానికి వచ్చే వారమని, ఇప్పుడు తమను తమ ప్రజలు గెలిపించి రెడ్ కార్పెట్ పరిచి పంపించారన్నారు. సచివాలయానికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
సచివాలయ ఉద్యోగులకు కెసిఆర్ ఎన్నోసార్లు ఎన్నో చెప్పారని, వాటిని నెరవేరుస్తామన్నారు. ఎంపీగా సచివాలయానికి వచ్చిన ఈ ఫీలింగ్ వర్ణానాతీతమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసేందుకు జీవించి ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కెసిఆర్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. మొదటి ప్రెస్ మీట్లోనే ఇబ్బంది పెట్టవద్దని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు.

కవిత
తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత. పక్కన కవిత భర్త, ఆమె తల్లి.

కవిత
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీమణితో తెలంగాణ తొలి సిఎం సతీమణి. పక్కన ఆయన కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.

కవిత
గవర్నర్ దంపతులతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు. కెసిఆర్, కెటిఆర్, కవితల కుటుంబ సభ్యులు.

కెసిఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications