హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాగితపు గణేశుడికి ఎంపి కవిత పూజలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాల ప్రతిష్టాపనను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాగితంతో తయారు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బిగ్ ఎఫ్ఎం, మహా సిమెంట్ సంయుక్తంగా ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన గ్రీన్ గణేశ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె గురువారం రాత్రి హాజరయ్యారు. ఈకో గణేశులను ప్రతిష్టించడం వల్ల పర్యావరణం సురక్షితంగా ఉంటుందని ఆమె అన్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని ఆమె హెచ్చరించారు.

బోనాలు, రంజాన్ తదితర పండుగలతో పాటు గణేశ్ ఉత్సవాలు విజయవంతం కావడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని పోలీసు జాయింట్ కమిషనర్ శివ ప్రసాద్ అన్నారు.

కవిత ప్రత్యేక పూజలు

కవిత ప్రత్యేక పూజలు

ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ఈకో ఫ్రెండ్లీ విగ్రహాల ప్రోత్సాహంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగితపు వినాయకుడికి కవిత ప్రత్యేక పూజలు చేశారు.

పర్యావరణ పరిరక్షణ...

పర్యావరణ పరిరక్షణ...

ఈకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల ప్రతిష్టాపన వల్ల పర్యావరణం సురక్షితంగా ఉంటుందని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని కవిత అన్నారు.

గ్రీన్ గణేశ అవార్డులు

గ్రీన్ గణేశ అవార్డులు

గ్రీన్ గణేష్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలతో పాటు నిజమాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత ఇలా..

విజేతలు వీరే..

విజేతలు వీరే..

గ్రీన్ గణేశ అవార్డులను అందుకున్నవారిలో హైదరాబాద్ గోస్ గ్రీన్ అభినవ్, రివీలో ఎకో సొల్యూషన్స్ ఖాజా శశికాంత్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కార్యకర్త అరుణ్ జ్యోతి, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫౌండర్ వేమ ఎస్ సుబ్రహ్మణ్యం , గుడ్ సీడ్స్ ఇన్ ఫౌండర్ నారాయణ్ కె మూర్తి ఉన్నారు.

English summary
Promoting eco friendly Ganesha Telangana Rastra Samithi (TRS) Nizamabad MP kalwakuntla kavitha participated in Green Ganesh awards presentation programme at Prasad imax in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X