చంద్రబాబు వెంటే మేం, టీడీపీ కోసం నేను-జూ.ఎన్టీఆర్ సిద్ధం: కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: నటుడు కళ్యాణ్ రామ్ తన రాజకీయ ఆరంగేట్రం, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమాలతో పాటు రాజకీయాలపై మాట్లాడారు.

'బాబు-లోకేష్‌లు ఏపీ వారెలా అవుతారు, జనసేన నేతలు కలిశారు.. ఆర్నెళ్లకో మీటింగ్ అంటే ఎలా?'

మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే.. ప్రస్తుతానికి అయితే తనకు ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పారు. రావాలనుకుంటే వస్తానని, కానీ సినిమా, రాజకీయ రంగమంటూ రెండు పడవలపై ప్రయాణించనని స్పష్టం చేశారు. రాజకీయ ఆరంగేట్రం చేస్తే తాతయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టేలా ప్రజాసేవ చేస్తానన్నారు.

చంద్రబాబు అంటే ఇష్టం

చంద్రబాబు అంటే ఇష్టం

తనకు మామయ్య చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టమని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఆయన విజన్ ఉన్న నేత అన్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తాము సినిమా రంగంలో బిజీగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు దేశంలోనే ప్రజాధరణ ఉన్న నేత అన్నారు.

 టీడీపీ కోసం నేను, జూ.ఎన్టీఆర్ సిద్ధం

టీడీపీ కోసం నేను, జూ.ఎన్టీఆర్ సిద్ధం

జూనియర్ ఎన్టీఆర్‌కు, తనకు మధ్య ఎప్పుడు రాజకీయాలపై చర్చ జరగలేదని కళ్యాణ్ రామ్ చెప్పారు. టీడీపీతరఫున ప్రచారంపై స్పందిస్తూ.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. తాను, జూ ఎన్టీఆర్ సినిమా రంగంలో బిజీగా ఉన్నామని, అవసరమైతే ప్రచారానికి వెళ్తామన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి తాము ఎప్పుడూ సిద్ధమన్నారు.

 ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాం

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాం

సినిమా పరిశ్రమ వారు ప్రత్యేక హోదా సాధనలో రావడం లేదని కొందరు విమర్శించడంపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. హోదా కోసం పోరాటం చేయరాదనే ఉద్దేశ్యం టాలీవుడ్‌లో ఎవరికీ లేదన్నారు. అవకాశం వస్తే తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పారు. ఏపీకి హోదా కోసం అవసరమైతే ఎంత వరకైనా పోరాటం చేస్తామని చెప్పారు.

మా కుటుంబం చంద్రబాబు వెంటే

మా కుటుంబం చంద్రబాబు వెంటే

చంద్రబాబు ప్రజల కోసం విరామం లేకుండా శ్రమిస్తుంటారని, అది ఆయనకు అలవాటు అని, ఆయన కోసం తమ కుటుంబం వెన్నంటే ఉందని కళ్యాణ్ రామ్ చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సారథ్యం, ఆయన పాలన అవసరమన్నారు. లేదంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు.

 అలా ఉందని భావించడం లేదు

అలా ఉందని భావించడం లేదు

నటి శ్రీరెడ్డి అంశంపై స్పందిస్తూ.. ఆమె ఆరోపిస్తున్నట్లుగా పరిశ్రమలో పరిస్థితులు ఉన్నాయని తాను భావించడం లేదని, ఇతరుల గురించి పట్టించుకునే సమయం లేదని కళ్యాణ్ రామ్ అన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Kalyan Ram praises Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and talks about hero Jr NTR.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి