Kambhampati Hari Babu : మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి హరిబాబు
ఈశాన్య రాష్ట్రమైన మిజోరం గవర్నర్‌గా డా.కంభంపాటి హరిబాబు సోమవారం(జులై 19) బాధ్యతలు స్వీకరించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ మైకెల్ జొథాన్‌ఖుమా హరిబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిరాడబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిజోరం ముఖ్యమంత్రి జొరంతంగా,పలువురు మంత్రులు,రాష్ట్ర చీఫ్ సెక్రటరీ,డీజీపీ తదితరులు హాజరయ్యారు.
1987లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 'మిజోరం'కు హరిబాబు 22వ గవర్నర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు,శ్రీధరన్ పిళ్లై మిజోరం గవర్నర్‌గా కొనసాగగా... ఇప్పుడా స్థానాన్ని హరిబాబు భర్తీ చేశారు.

కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉన్న తిమ్మ సముద్రంలో 1953లో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు.1993 వరకు ఆంధ్రా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.
1993-2003 వరకు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1999లో హరిబాబు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హరిబాబుపై ఓటమి చెందారు. అదే సంవత్సరం ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హరిబాబు జైఆంధ్రా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
Recommended Video
మిజోరాం గవర్నర్‌గా తనను నియమించినందుకు హరిబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మిజోరాం అభివృద్ది కోసం తాను శాయాశక్తులా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ బద్దంగా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications