ఢిల్లీ ప్రతినిధిగా: చంద్రబాబుకు కంభంపాటి థ్యాంక్స్
హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులైన మాజీ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి రామమోహన్ రావు మంగళవారంనాడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో గలంతైన విద్యార్థుల ఆచూకి కోసం కంభంపాటి రామమోహన్ రావు, మంత్రి పి నారాయణ అక్కడే మకాం వేసి తల్లిదండ్రులకు అండగా నిలిచినందుకు చంద్రబాబు అభినందించారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధిక సహాయ సహకారాలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

రేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తానని కంభంపాటి రామమోహన్ రావు ఈ సందర్భంగా అన్నారు. వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ఎంపిల తోడ్పాటుతో కృషి చేస్తానని ఆయన చెప్పారు.
అత్యున్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, వైద్య సంస్థలు, రక్షణ సంస్థలను ఆంద్రప్రదేశ్‌లో నెలకొల్పేలా చొరవ చూపుతానని అన్నారు. ఢిల్లీలో తనకున్న పరిచయాలను వినియోగించుకుని జాతీయ పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటు పడుతానని కంభంపాటి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications