పురందేశ్వరి వ్యాఖ్యలపై కంభంపాటి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన లెక్కలు పంపితే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ మండిప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన లెక్కలు పంపితే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు.
పోలవరం వివాదంపై బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో.. కంభంపాటి రామ్మోహన్ మాట్లాడుతూ తప్పుడు లెక్కలు చెప్పే అలవాటు టీడీపీకి లేదని ఉద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పనులు మూడేళ్లుగా అత్యంత నాణ్యతతో జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 90 శాతం మట్టిపనులు, 40 శాతం కాంక్రీట్ పనులు జరిగాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తంగా 50 శాతం పూర్తయ్యాయని, పోలవరం నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి లేదనడం అవగాహన రాహిత్యమని రామ్మోహన్ పేర్కొన్నారు. సామర్థ్యం లేకపోతే మూడేళ్లలో 50 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications