చిరంజీవి పై వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నా, తొలిగించండి..!!

బాలకృష్ణ Vs చిరంజీవి ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భం లో బాలకృష్ణ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీని పైన చిరంజీవి సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యల పైన చిరంజీవి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన మెగా బ్రదర్స్ స్పందించక పోవటం పైన చర్చ జరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీలో ఈ వ్యాఖ్యల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

ఏపీ అసెంబ్లీలో సినీ పరిశ్రమ పైన మాట్లాడుతూ మాజీ మంత్రి.. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీసాయి. చిరంజీవి తో సహా సినీ ప్రముఖులను పిలిచిన జగన్ ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పారని..దీంతో, చిరంజీవి గట్టిగా మాట్లాడటంతో జగన్ నేరుగా చర్చలు చేసారని కామినేని చెప్పుకొచ్చారు.

Kamineni Srinivas Request to remove his comments in Assembly Records details here

దీని పైన బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని సభలోనే స్పష్టం చేసారు. ఆ సమయం లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన చిరంజీవి రియాక్ట్ అయ్యారు. తాను గట్టిగా మాట్లాడలేదని.. జగన్ సాదర ఆహ్వానం పలికారని చెప్పుకొచ్చారు. తాను జగన్ తో చేసిన చర్చలకు నాడు తనతో పాటుగా సమావేశానికి వచ్చిన సినీ ప్రముఖులే సాక్ష్యమని చెప్పుకొచ్చారు.

ఆ సమావేశానికి బాలకృష్ణ ను సైతం ఆహ్వానించామని.. ఆయన అందుబాటులోకి రాకపోతే జెమిని కిరణ్ కు పంపానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసిన చర్చల ఫలితంగానే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమా టికెట్ ధరలు పెరిగాయని వివరించారు. బాలకృష్ణ సభలో చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్.. నాగబాబు ఈ వివాదం పైన స్పందించలేదు.

ఇక.. తాజాగా సీఎం చంద్రబాబు సైతం సభలో కామినేని శ్రీనివాస్ - బాలకృష్ణ మధ్య ఈ సంవాదం జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో.. ఈ కామినేని శ్రీనివాస్ సభలో తాను చేసిన వ్యాఖ్యలు అపార్దాలకు కారణం దారి తీసిందని.. దీని కారణంగా సంబంధిత విషయాలు రికార్డ్ ల నుంచి తొలగించాలని సభలోనే అభ్యర్ధించారు. దీంతో.. ఈ వివాదం మరింత పెరగకుండా.. చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+