టిడిపిలో చేరడం లేదు, పవన్ కళ్యాణ్ మద్దతుతో గెలిచా: కామినేని
తాను భారతీయ జనతా పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీని చేరనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని మంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్ బుధవారం అన్నారు.
అమరావతి: తాను భారతీయ జనతా పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీని చేరనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని మంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్ బుధవారం అన్నారు.
తన గెలుపులో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు. తాను ఎవరికీ శత్రువును కాదని, అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పారు.

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు తాను బిజెపిలోనే ఉంటానని ఆయన చెప్పారు. కాగా, కామినేని టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం ఇటీవల జరిగింది. దీనిపై ఆయన స్పందించారు.












Click it and Unblock the Notifications