ఇంద్రకీలాద్రి: పాత విధానానికి గుడ్ బై. న్యూ ఇయర్ నుంచి భక్తులకు ఇవి తప్పనిసరి
2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరణంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ అధికారులు నూతన సంస్కరణలకు భక్తుల కోసం అమలులోకి తీసుకవచ్చారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా ఆలయ పాలకమండలి, అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
పారదర్శకతకు పెద్దపీట..
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి ఉచిత లడ్డూ ప్రసాదం విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. రూ. 500/- అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదాన్ని ఇకపై నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు.. భక్తుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవచ్చని ఆలయ అధికారులు భావించారు.

ప్రతి భక్తుడికి ప్రసాదం
స్కానింగ్ పాయింట్ వద్ద పంపిణీ చేయడం వల్ల ఏ ఒక్క భక్తుడు కూడా తన ఉచిత ప్రసాదాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. ప్రతి టికెట్‌కు నిర్ణీత సంఖ్యలో లడ్డులు అందేలా పక్కాగా పర్యవేక్షించబడుతుంది. ఆలయ చైర్మన్, ఈవో ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థాన పాలనలో సాంకేతికతను జోడించి, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో ఈ వినూత్న అడుగు ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఆహ్లాదకరమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం.












Click it and Unblock the Notifications