గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు సీఎంల కుట్రే బీఆర్ఎస్ చేరికలు - వారే లక్ష్యం: పవన్ కు అండగా నిలుస్తా : కన్నా..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు వెనుక కారణాలను విశ్లేషించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ తో తన రాజకీయ ప్రయాణం పైన క్లారిటీ ఇచ్చారు. ప్రధాని బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇచ్చారని స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ సమయంలో కన్నా జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కన్నా మరోసారి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

పవన్ - బండి సంజయ్ పై ఇద్దరు సీఎంల కుట్ర

పవన్ - బండి సంజయ్ పై ఇద్దరు సీఎంల కుట్ర


బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. తాను నియమించిన జిల్లా అధ్యక్షులను ఆయన తొలిగిస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుల మార్పు పైన తనకు సమాచారం లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఏపీలో విస్తరణ పైన కన్నా స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్ - కేసీఆర్ కలిసి చేస్తున్న కుట్రే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఏపీలో పవన్ కల్యాణ్ .. తెలంగాణలో బండి సంజయ్ ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ తో కొత్త నాటకం ప్రారంభించారని విమర్శించారు. ఏపీలో కాపులు, తెలంగాణలో మున్నూపు కాపులు ఏకం అవుతుండటంతో బీఆర్ఎస్ ద్వారా రాజకీయం మొదలు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు. వారిద్దరి కుట్రలో భాగమే బీఆర్ఎస్ లో చేరికలని కన్నా ఆరోపించారు. సోము వీర్రాజు వియ్యంకుడు సైతం బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.

పవన్ కు అండగా నిలుస్తా..

పవన్ కు అండగా నిలుస్తా..


కన్నా లక్ష్మీనారాయణ తో కొద్ది రోజుల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అప్పటి నుంచి కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం పతాక స్థాయికి చేరింది. అప్పటికే కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పైన ఆగ్రహంతో ఉన్నారు. అయితే, పార్టీ అధినాయకత్వం సూచనతో కన్నా కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి బీజేపీ - జనసేన పొత్తు కలిసి పని చేయటం పైన స్పందించారు. పవన్ కల్యాణ్ కు తాను అండగా ఉంటానని కన్నా వెల్లడించారు. దీని ద్వారా తాను జనసేనలో చేరుతానని పరోక్షంగా స్పష్టం చేసినట్లు అర్దం అవుతోంది. ఇప్పటికే బీజేపీ -జనసేన కలిసి కార్యక్రమాలు నిర్వహించకపోవటం పైన సోము వీర్రాజును ప్రశ్నించాలని కన్నా సూచించారు. తన వియ్యంకుడు

ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చారు

ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చారు


ఇప్పటికే ఏపీ బీజేపీకి పార్టీ నాయకత్వం రెండు సార్లు రోడ్ మ్యాప్ ఇచ్చారని కన్నా వెల్లడించారు. విశాఖలో ప్రధాని పర్యటన సమయంలోనూ రోడ్ మ్యాప్ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీలో కన్నా వర్సస్ వీర్రాజు రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు వరుసగా జిల్లా అధ్యక్ష పదవుల మార్పుతో వారంతా పార్టీ వీడుతున్నారు. దీనికి వీర్రాజు నిర్ణయాలే కారణమని కన్నా ఆరోపిస్తున్నార. అదే సమయంలో తాను పవన్ కు అండగా ఉండే విషయం పైనా కన్నా క్లారిటీ ఇచ్చారు.

English summary
BJP leader Kanna Lakshmi Narayana serious comments against Somu Veerraju and BRS joinings in AP, Announces he supports PAwan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X