గుంటూరు జిల్లాలో దూసుకెళుతున్న 'కన్నా ఎక్స్ ప్రెస్'!
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాట్ టాపిక్ గా మారారు. ఎప్పుడైతే ఆయన పార్టీలో చేరారో అప్పటి నుంచి జిల్లా రాజకీయాలు మారిపోయాయి. రెండు వారాల క్రితమే జిల్లాకు చెందిన పార్టీ నేతలందరికీ ఆత్మీయ విందు ఇచ్చారు. ఒకరిద్దరు మినహా జిల్లాలోని సీనియర్ టీడీపీ నాయకులంతా హాజరయ్యారు. అంతేకాదు.. కన్నాకు బద్ధశత్రువుగా భావించే రాయపాటి సాంబశివరావు తరఫున ఆయన సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఈ పరిణామంతో లక్ష్మీనారాయణ అమితమైన ఆనందానికి లోనయ్యారు.
గుంటూరు జిల్లాలో కన్నాకు చంద్రబాబు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఏ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారు? గెలిచిన తర్వాత మంత్రి పదవిస్తారా? అనే ప్రశ్నలు జిల్లా రాజకీయాల్లో ఉత్పన్నమయ్యాయి. పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు నిరంతరం కన్నాను కలుస్తూనే ఉన్నారు. ఒకప్పుడు అంబటి రాంబాబుకు ముఖ్య అనుచరుడైన సయ్యద్ మాబు ఇంటికి వెళ్లి కన్నా ఆయన్ను పలకరించారు. అంబటి రాంబాబు మాబును దూరం పెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇప్పుడు కన్నా నేరుగా వెళ్లి కలవడంతో త్వరలోనే మాబు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మైనార్టీ వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ టీడీపీని గెలిపించడానికి కన్నా ప్రయత్నం చేస్తున్నారని, మైనార్టీలను మచ్చిక చేసుకునే కోణంలోనే సయ్యద్ మాబును కన్నా స్వయంగా కలిసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే తెనాలి మున్సిపల్ సమావేశంలో దాడికి గురైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ ను కూడా కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు లాంటి సీనియర్లను తీసుకొని వెళ్లి మరీ యుగంధర్ ను పలకించారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలస్యంగా పార్టీలో చేరినా జిల్లాలో టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్నరాని, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు కన్నా పెద్ద దిక్కుగా మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications