ఆ హాట్ సీట్‌లో వైసీపీ- టీడీపీ హోరాహోరీ: డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా
Sattenapalli Assembly constituency roundup: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లోకసభ పరిధిలోకి వచ్చే జనరల్ నియోజకవర్గం.. సత్తెనపల్లి. రాజుపాలెం, సత్తెనపల్లి, నకరికల్లు, ముప్పాళ్ల మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 2,30,743 మంది ఓటర్లు ఉన్నారు.
సంఖ్యాపరంగా కమ్మ, ముస్లిం, ఎస్సీ, కాపు, రెడ్డి, వైశ్య, యాదవ సామాజిక వర్గాల ఓటుబ్యాంకు అధికం. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ, రెడ్డి, కాపు కులాలు మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంటూ ఉంటుంది. ఈ మూడు సామాజిక వర్గాల నాయకులే ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య విజయం సాధించారు. ఏకంగా మూడుసార్లు ఆయన ఇండిపెండెంట్‌గా, ఒకసారి సీీపీఐ అభ్యర్ధిగా గెలిచారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు వావిలాల, రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ, కాంగ్రెస్ మూడుసార్లు చొప్పున, సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కోసారి గెలిచాయి.
2009లో కాంగ్రెస్ అభ్యర్ధి యర్రం వెంకటేశ్వరరెడ్డి.. టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మకాయల రాజనారాయణ మీద 7,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి డాక్టర్ కోడెల శివప్రసాద్.. వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు మీద 924 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో మళ్లీ ఆ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. కోడెలపై 20,876 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు అంబటి రాంబాబు. ఈ ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చింది టీడీపీ. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలట్లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకే టికెట్ దక్కొచ్చనే ప్రచారం ఉంది.
అటు కన్నా, ఇటు అంబటి ఇద్దరూ కాపు సామాజిక వర్గ నాయకులే. కమ్మ, రెడ్డి ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాపు ఓట్లు, మిగిలిన కులాల ఓట్లు ఎలా పడతాయనేది, అభ్యర్థి గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.












Click it and Unblock the Notifications