పులి జగన్ కు పొత్తుల మీద భయమా ? సుప్రీంలో ఉండగా రాజధాని ప్రకటనలతో మోసం- కన్నా కామెంట్స్..
ఏపీలో వైసీపీ సర్కార్ రాజధానిపై చేస్తున్న ప్రకటనలు, టీడీపీ-జనసేనకు జగన్ విసురుతున్న సవాళ్లపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ విమర్శలు గుప్పించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై తాజాగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా టీడీపీ-జనసేనకు జగన్ విసురుతున్న ఒంటరి పోటీ సవాల్ తో పాటు వైజాగ్ లో రాజధానులపై చేసిన ప్రకటనలపైనా కన్నా విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్ పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ఆయన లిక్కర్ కు ,అక్రమ ఇసుక మైనింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. పులి అనిచెప్పుకునే జగన్ కు పొత్తుల పై భయం ఎందుకని ప్రశ్నించారు. జగన్ అనే ఒక రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాగే గుంటూరు జిల్లా ఇప్పటం ప్రజలపై కక్షసాధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం కులగొట్టడాలతోనే ప్రారంభం అయ్యిందన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క కట్టడం ఎక్కడైనా కట్టారేమో సమాధానం చెప్పాలన్నారు.

పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం ఇప్పటం ప్రజలు చేసిన తప్పా..అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, దీనిపై సీఎం జగన్ కు భయం ఎందుకన్నారు. జగన్ కు ఎన్నికల సంవత్సరం పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యం గా ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తె సంతోషమే అన్నారు. రాష్ట్రం లో పోలీసు పాలన సాగుతుందని, పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించాలన్నారు. విశాఖలో పెట్టుబడి దారులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు లో ఉన్న రాజధాని అంశాన్ని మభ్య పెట్టి విశాఖ రాజధాని చేస్తాను అని మోసం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యల్ని కన్నా తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications