కాపు ఐక్య గర్జన: రాయలసీమలో కట్టడికి చంద్రబాబు హుకుం (ఫోటోలు)

అమరావతి: రాయలసీమలోని కాపు నాయకులు, కాపు కులస్తుల మీద అధికార పార్టీ నాయకులు డేగ కన్ను వేశారు. ఈనెల 5వ తేది నుంచి కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

రాయలసీమలోని కాపు సంఘం నాయకులు ఎవరెవరు ముద్రగడకు మద్దుతు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు, వారు ఎంతమంది కాపు కులస్తులను సమీకరిస్తున్నారు, సొంత ప్రాంతాల్లో ఏమైనా ఆందోళనలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారా అని ఆరా తీస్తున్నారు.

అనంతపురం, రాయచోటి, కదిరి, రాజంపేట, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పీలేరు తదితర ప్రాంతాల మీద అధికార పార్టీ నాయకులు నిఘా వేశారు. ఈ ప్రాంతాల నుంచి జనవరి 31న తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనకు భారీ సంఖ్యలో కాపు కులస్తులు తరలి వెళ్లారు.

తిరుపతి, చిత్తూరులో

తిరుపతి, చిత్తూరులో

చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాల్లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులు ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వీలైనంత వరకు కాపు కులస్తులు ఆందోళన చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజంపేటలో అంతే

రాజంపేటలో అంతే

రాజంపేటలో అధికార పార్టీకి చెందిన శాసన సభ్యురాలు ఉన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు కాపుకులానికి చెందిన వారే.

మంత్రులు, నాయకులదే బాధ్యత

మంత్రులు, నాయకులదే బాధ్యత

ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ఇతర ప్రాంతాల నుంచి వీలైనంత మంది తరలిరాకుండా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సొంత వాహనాలే దిక్కు

సొంత వాహనాలే దిక్కు

ఆర్టీసీ బస్సులు అద్దెకు చిక్కకపోవడంతో సొంత వాహనాలు, ప్రయివేటు బస్సులు, టూరిస్టు బస్సులు, ట్యాక్సీలను ఇప్పటి నుంచి కొందరు నాయకులు బుక్ చేసుకుంటున్నారు.

రామచంద్రయ్య ఉన్నా శూన్యం

రామచంద్రయ్య ఉన్నా శూన్యం

కడప జిల్లాకు చెందిన సీ. రామచంద్రయ్య కాపు కులానికి చెందిన వారే. అయితే ఆయనకు జనసమీకరణ చేసే సత్తా లేదని కాపు కులస్తులే అంటున్నారు.

వైఎస్ఆర్ సీపీ నాయకులు వస్తే

వైఎస్ఆర్ సీపీ నాయకులు వస్తే

కాపు కులస్తులను ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు తరలించాలని వైఎస్ ఆర్ సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా

రాజకీయాలకు అతీతంగా

చాల మంది కాపు కులస్తులు రాజకీయాలకు అతీతంగా తాము పోరాటం చేస్తామని అంటున్నారు. వారిలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

రాయలసీమ ను చూడండి

రాయలసీమ ను చూడండి

ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, ప్రతిపక్ష నాయకుడు జగన్ సొంత జిల్లా కడప రాయలసీమలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో పోలీసులు సైతం నిఘా పెట్టారు.

సొంత ఊర్లలో రిలే నిరాహార దీక్షలు

సొంత ఊర్లలో రిలే నిరాహార దీక్షలు

చాల మంది కాపు నాయకులు సొంత ఊర్లలోనే రిలే నిరాహార దీక్షలు చెయ్యాలని నిర్ణయించారు. ఇప్పటికే అనుమతి కోసం స్థానిక పోలీస్ స్టేషన్ ల్లో వినతి పత్రాలు సమర్పించారు.

మహిళలు, విద్యార్థులు

మహిళలు, విద్యార్థులు

రిలే నిరాహార దీక్షలలో వీలైనంత వరకు మహిళలు, విద్యార్థులు పాల్గోనే విధంగా చూడాలని నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+