వచ్చే ఎన్నికలపై హరిరామజోగయ్య విశ్లేషణ-టీడీపీ 70, జనసేన 50, వైసీపీ 55-పవన్ సీఎం ఖాయం !
ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణేనని కాపు నేత హరిరామజోగయ్య స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాల్ని ఆయన సీట్ల రూపంలో విడుదల చేశారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయన్న దానిపై కాపు నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య విడుదల చేశారు. ఏ పార్టీకి ఎన్నిసీట్లు రాబోతున్నాయి, ఎన్నికలు ఎప్పుడు జరిగితే ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే పవన్ వారాహి యాత్రతో జనసేన సీట్ల సంఖ్య ఎలా పెరగబోతోంది, అలాగే టీడీపీ-జనసేన పొత్తు వల్ల మారుతున్న లెక్కల్ని జోగయ్య తన విశ్లేషణలో వెల్లడించారు.

హరిరామజోగయ్య విశ్లేషణ
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు రాబోతున్నాయనే దానిపై కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన విశ్లేషణను విడుదల చేశారు. దీని ప్రకారం పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు వచ్చే సీట్లు, వచ్చే ఏడాది కాలంలో జరిగే మార్పులతో ఈ లెక్కలున్నాయి. ఇందులో వారాహి యాత్రతో పాటు టీడీపీతో పొత్తు కారణంగా జనసేనకు వచ్చే సీట్ల సంఖ్యతో పాటు పవన్ కళ్యాణే సీఎం కాబోతున్నట్లు జోగయ్య అంచనా వేస్తున్నారు.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే
ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై జోగయ్య కీలక సమీకరణం వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలయ్యే నాటికి ఒంటరి పోరుకు సిద్ధపడితే జనసేనకు 14 శాతం ఓట్లతో 20 సీట్లు వస్తాయని జోగయ్య అంచనా వేస్తున్నారు. అలాగే టీడీపీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని కూడా జోగయ్య తెలిపారు.

పవన్ బస్సుయాత్ర పూర్తయితే
పవన్ కళ్యాణ్ చేపట్టే వారాహి బస్సు యాత్ర పూర్తయితే మాత్రం జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య కూడా 20 నుంచి 35 సీట్లకు పెరుగుతుందని జోగయ్య అంచనా వేశారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. పవన్ యాత్ర పూర్తయితే వైసీపీ ఓట్ల శాతం మాత్రం 40 శాతానికి పడిపోతుందని, అలాగే సీట్లు కూడా 100 నుంచి 80కి తగ్గుతాయని జోగయ్య విశ్లేషిస్తున్నారు. అలాగే ఇతరుల ఓట్ల శాతం కూడా 2కు పెరుగుతుందన్నారు.

జనసేన-టీడీపీ పొత్తుంటే ఇలా..
అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే వచ్చే ఓట్లు, సీట్ల సంఖ్యను కూడా జోగయ్య వెల్లడించారు. దీని ప్రకారం వీరిద్దరు పొత్తు పెట్టుకుంటే మాత్రం ఈ కూటమికి 58 శాతం ఓట్లు, జనసేనకు 50 సీట్లు వస్తాయని, అలాగే టీడీపీకి 70 సీట్లు వస్తాయని జోగయ్య అంచనా వేశారు. వైసీపీకి మాత్రం 40 శాతం ఓట్ల శాతం కంటిన్యూ అవుతుందని కానీ 55 సీట్లు మాత్రమే వస్తాయని విశ్లేషించారు. అలాగే ఇతరులకు మాత్రం 2 శాతం ఓట్లు వస్తాయని, కానీ సీట్లు మాత్రం రావన్నారు.

పవర్ కళ్యాణ్ గా పవన్ కళ్యాణ్ ?
అయితే వారాహి యాత్ర, టీడీపీ-జనసేన పొత్తు కారణంగా జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య 20 నుంచి 50 సీట్లకు పెరుగుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. టీడీపీకి 70 సీట్లు వస్తాయని విశ్లేషించారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని జోగయ్య చెబుతున్నారు. అంటే చంద్రబాబుతో సీఎం పదవి పంచుకుని సీఎం అవుతారా లేక మరేదైనా ఒప్పందం చేసుకుని సీఎం అవుతారా అన్నది మాత్రం జోగయ్య వెల్లడించలేదు. కానీ పవన్ కళ్యాణ్ కాస్తా పవర్ కళ్యాణ్ కావడం ఖాయమని జోగయ్య చెప్తున్నారు.












Click it and Unblock the Notifications